రన్ వే పై నుంచి అదుపుతప్పి…మూడు ముక్కలైన 183 మంది ప్రయాణిస్తున్న విమానం

ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంత భయంకరమైన విమాన ప్రమాదం జరిగిందో మనం చూశాం. ఇప్పుడు మరొక విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో ఈ విమాన ప్రమాదం జరిగింది. బుధవారం టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737, 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లోని సబీహా గోకెన్ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అవ్వాల్పి ఉంది. అయితే సబీహా గోకెన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పిన విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగి విమానం మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Plane Breaks Apart In A Turkish Field, Injuring Nearly 179

విమానంలో ఎక్కువ మంది టర్కీలు ఉండగా 22 మంది 12 దేశాలకు చెందిన వారు, 12 మంది చిన్నారులు ఉన్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. పైలెట్ కోలుకున్న తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు పైలెట్లు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు టర్కీ మీడియా తెలిపింది. ఇద్దరు పైలెట్లలో ఒకరు టర్కీ దేశస్థుడు కాగా మరొకరు దక్షిణ కొరియాకు చెందినవారని తెలిపింది. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం కిందపడిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని, ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని చెప్పారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్లాంబుల్ లో భారీ వర్షం,బలమైన గాలులు కారణంగా విమానం రన్ వే పై నేంచి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. రన్ వే నుంచి 60 మీటర్ల వరకు రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగిందన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

విమానాన్ని తరలించే వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబందించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. ఫుటేజీలో రన్ వే పైకి వస్తోన్న సమయంలో విమానం హై స్పీడ్‌లో ఉంది. రన్ వే నుంచి 40 మీటర్ల దూరం వరకు గల రోడ్డుపైకి దూసుకొచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా గాలి వీచింది. అంతకుముందు రెండు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించలేదు. కానీ పెగాసస్ విమానానికి పర్మిషన్ ఇవ్వడంతో ప్రమాదం జరిగిందనే అనుమనాలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation