ప్లీజ్‌ కాపాడండి… భారత్‌ ను వేడుకుంటున్న పాకిస్తాన్.. మీ మేలు మర్చిపోం

26

వైర‌స్ కష్టకాలంలో తమను ఆదుకోవాలని పొరుగు దేశం పాకిస్తాన్ భారత్ ను వేడుకుంటోంది. పాకిస్తాన్‌లో వైర‌స్ శరవేగంగా కమ్మేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 5వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

Coronavirus: how Pakistan is using technology to disperse cash to ...
సొగసులతో చిత్తు చేస్తున్నమీరా చోప్రా.

ఇలాంటి సమయంలో అత్యవసర సేవలు చాలా అవసరం. కానీ పేద దేశమైన పాకిస్తాన్‌లో ఆరోగ్యపరరమైన మౌలిక సదుపాయాలు తక్కువ. అందులోనూ ఈ వైర‌స్ రోగులకు వెంటిలేటర్లు చాలా అత్యవసరం. వైర‌స్ ముదిరిన రోగులకు అవి లేకుండా ప్రాణాలు గాల్లో కలసిపోవడమే. అందుకే వెంటిలేటర్లు పంపి మా ప్రాణాలు కాపాడండని.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ అక్తర్ భారత్‌ కు విజ్ఞప్తి చేశారు.

పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న విబేధాలు మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ భారత సాయాన్ని గుర్తు పెట్టుకుంటుందన్నారు. అక్తర్ ఏమన్నారంటే.. భారత్ మాకు 10వేల వెంటిలేటర్లు అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అయితే మేం మ్యాచ్‌ల గురించి మాత్రమే మాట్లాడగలం. మిగతాదంతా అధికారిక సంస్థలే నిర్ణయిస్తాయి అన్నారు… మ‌రి దీనిపై ఆ దేశ ప్ర‌ధాని స్పందిస్తే భార‌త్ సాయం చేసే అవ‌కాశం ఉంటుంది అంటున్నారు అన‌లిస్టులు.

Content above bottom navigation