కేంద్రం మరో గుడ్ న్యూస్..వారికి ఉచితంగా 8 వంట గ్యాస్ సిలిండర్లు

కేంద్రం తాజాగా మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది పేద‌ల‌కు, వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం(PMUY) లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ ను ఉపయోగించే వినియోదారులకు… రాబోయే మూడు నెలల్లో 8 సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో 8 కోట్ల మంది లబ్ది పొందనున్నారు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

MEHUL J PATEL on Twitter: "@hpcl @PetroleumMin Promotion for ...

లాక్ డౌన్ నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే పీఎంయూవై లబ్దిదారులకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లు వాడే వారికి మూడు, 5కేజీల సిలిండర్లు వాడే వారికి 8 చొప్పున ఇవ్వనున్నారు. మూడు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఇస్తారు. లాక్ డౌన్ అయినప్పటి నుండి, దేశంలో రోజుకు 50 నుండి 60 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని. చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికి .. బుక్ చేసిన రెండు రోజుల లోపల్లేనే సిలిండర్లు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

50 మిలియన్ల పేద గృహాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు కల్పించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 మే 1 న బల్లియా (ఉత్తర ప్రదేశ్) లో పిఎంయువై ప్రారంభించారు. తరువాత, లక్ష్యాన్ని 80 మిలియన్ల గృహాలకు పెంచారు. ఈ టార్గెట్ అనుకున్న సమయానికి ఆరు నెలలు ముందుగా 2019 సెప్టెంబర్ 7 న సాధించబడింది.

Content above bottom navigation