చిరంజీవి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రీక్తం.. తరలివస్తున్న పోలీసులు

156

ఆంద్రప్రదేశ్ రాష్టంలో అమరావతి రాష్టం మీద రగడ జరుగుతున్నా సంగతి తెలిసిందే. దాదాపు 73 రోజుల నుంచి అమరావతి రైతులు ఈ ధర్నాకు దిగారు. ఆంద్రప్రదేశ్ మంత్రులు వీరిని లెక్కచెయ్యకుండా తమ పని తాము చేసుకుంటూపోతున్నారు. ప్రతిపక్షనేతలు అమరావతి రైతులతో కలిసి ధర్నాలకు దిగుతున్నారు. ఐన కూడా ప్రభుత్వం రాజధాని తరలింపు మీద వెనుకడుగు వెయ్యడం లేదు. అయితే అమరావతీ రైతులకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. అందుకే అమరావతి రైతులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటిని టార్గెట్ చేశారు. చిరంజీవి ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. రాజధాని అమరావతికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకాలని నేడు చిరంజీవి ఇంటి ముందు ధర్నా చెయ్యాలని యువసేన జేఏసీ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి

మరోపక్క ధర్నా విరమించుకున్నామని అమరావతి జేఏసీ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా ధర్నా చేస్తే మాకు సంబంధం లేదని కూడా అమరావతి జేఏసీ ప్రకటన చేసింది. ఈ గందరగోళం మధ్య పోలీసులు మెగాస్టార్ ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటె ఇక రాజధాని సెగ తమ అభిమాన హీరో చిరంజీవికి తగలకుండా కాపాడుకుంటామంటున్నారు మెగాఫ్యాన్స్. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ముందుగా ప్రకటించి ఆతర్వాత ఆ ధర్నాను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది . కానీ మెరుపు ధర్నా చేసే అవకాశం ఉందని భావిస్తున్న మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఇంటి ముందు హంగామా చేస్తున్నారు. చిరంజీవి జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్తున్నారు. ఇక అమరావతి జేఏసీ కంటే ముందే చిరంజీవి ఇంటికి చేరుకున్న మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా మెగాస్టార్ జిందాబాద్ అంటూ ధర్నాకు దిగారు.ఇక జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ వారు అమరావతి యువసేన జేఏసీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెగా స్టార్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటున్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి భారీగా చేరుకున్న మెగాస్టార్ అభిమానులు తమ హీరోకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా సహించం అని తేల్చి చెప్తున్నారు.

Image result for అమరావతి చిరంజీవి

మెగాస్టార్ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పినవారు ఏ సమయంలో అయినా ధర్నా చేస్తారన్న అనుమానంతో మెగాఫ్యాన్స్ చిరంజీవి ఇంటి ముందు ముందుగానే బైఠాయించారు. ఫ్యాన్స్ అక్కడే కూర్చుని చిరంజీవికి అనుకూల నినాదాలు చెయ్యటంతో చిరంజీవి ఇంటి వద్ద హంగామా నెలకొంది. ఏది ఏమైనా రాజధాని అమరావతి రగడ హైదరాబాద్ లోని మెగా స్టార్ ఇంటికి చేరింది. ఇప్పుడు రాజధాని కోసం ఆందోళన చేసే వారు వస్తారని చిరంజీవి ఫ్యాన్స్ అక్కడ కాపలా కూర్చోవటం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation