మారుతిరావు మ‌ర‌ణ వార్త విన్న ప్ర‌ణ‌య్ త‌మ్ముడు ఏం చేసాడో తెలిస్తే నమ్మలేరు

90

న‌ల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తిరునగరు మారుతీరావు మృతి చెందారు.తన కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన మారుతీరావు హత్య చేయించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో జైలుకు వెళ్లి, ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు.అయితే, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఆదివారం ఉదయం మారుతీ రావు భార్య ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. సెల్‌ఫోన్‌కు ఫోన్ చేస్తే స్పందించకపోవటంతో ఆర్యవైశ్య భవన్ రిసెప్షన్‌కు ఫోన్ చేసింది. అలాగే, అనుమానంతో పోలీసులకు కూడా ఆమే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.భవన్ సిబ్బంది మారుతీరావు బస చేసిన గదికి వెళ్లినా ఆయన స్పందించలేదు. ఈలోపు భవన్ వద్దకు చేరుకున్న పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా ఆయన మంచంపై విగతజీవిగా కనిపించారు.

అమృత, ప్రణయ్

గ‌త కేసు ని ప‌రిశీలిస్తే…. ప్రేమ, పెళ్లి కారణంగా ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని సోదరుడు అజయ్ ఉక్రెయిన్ నుంచి ఆరోజు త‌న సోద‌రుడ్ని చివ‌రి చూపు చూసేందుకు వచ్చాడు. ఆరోజు ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు… అజయ్ విషాద‌వ‌ద‌నంలో ఉన్నారు… వదినను, తల్లిదండ్రులను అలా చూసి అజయ్ కన్నీరుమున్నీరు అయ్యాడు. అక్కడ ఆరోజు ఉద్వేగభరిత, ఉద్విగ్న వాతావరణం కనిపించిది… ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు తన వదిన అమృత వాళ్ల నాన్న కక్ష పెంచుకున్నారని అజయ్ ఏడుస్తూ చెప్పారు. అమృత తండ్రి, బాబాయ్ శ్రవణ్‌లను ప్రజలే చంపేస్తారని హెచ్చరించారు… ఇంతటి సైకో తండ్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఇది కక్ష మాత్రమే కాదని, నమ్మకద్రోహం అన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేశారన్నారు.

మారుతీరావు ఆత్మహత్య... వీలునామా రద్దు చేయించిన తమ్ముడు

ఆనాడు అజయ్ మాట్లాడుతూ.. వాళ్లకి కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆయన ఎంత చూపించుకుంటాడో చూపించుకోనివ్వండని, కానీ నేను డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నానని, జనాలు నిన్ను చంపేస్తార్రా.. అని కన్నీరుమున్నీరు అయ్యారు. మీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరన్నారు. నువు జైల్లో చచ్చిపో.. బయటకు వస్తే మాత్రం జనాలు చంపేస్తారన్నారు. నీవు, నీ తమ్ముడు, అందర్నీ చంపేస్తారన్నారు. మేం చంపం… కానీ జనాలు మిమ్మల్ని మిగల్చరన్నారు.

Image result for maruthirao

అయితే నేడు ప్ర‌జ‌లు కాదు నేరుగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు మారుతీరావు.. అయితే ప్ర‌ణ‌య్ సోద‌రుడు మాత్రం పాపం పండింది అని త‌న త‌ప్పు తాను తెలుసుకుని త‌న‌కు తానుగా శిక్ష వేసుకున్నాడు అని భావించార‌ట‌, అయినా నా అన్న‌ని చంపిన మిగిలిన వాళ్లు అందరికి స‌రైన శిక్ష ప‌డాలి అని అజ‌య్ కోరుకుంటున్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation