సంపూర్ణ చంద్రగ్రహణం గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లోని ఈ పనులు చెయ్యకండి

117

జూన్ 5 న ఈ సంవత్సరంలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం తో పాటు అన్తార్కితికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.అయితే, ఈ చంద్రగ్రహణం మూడు విధాలుగా ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఇప్పుడు జూన్ 5 న ఏర్పడబోయే చంద్రగ్రహణం పెనంబ్రల్ చంద్రగ్రహణం.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈ గ్రహణం సమయంలో భూమి యొక్క ముఖ్యమైన నీడ చంద్రునిమీద పడదు. భారత్ లో ఎప్పుడు..? జూన్ 5 న ఏర్పడే పెనంబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది. మొత్తం గ్రహణ సమయం మూడు గంటల 19 నిమిషాలు.. అయితే, 12.54 నిమిషాలకు పూర్తిగా చంద్రుడు కనిపించని స్థితి వస్తుంది.

చంద్ర గ్రహణం గర్భిణులు చూడకూడదని చాలామంది చెప్తుంటారు. అంతే ఈ గ్రహణాన్ని చూస్తే కళ్లు పోతాయని కూడా చెప్తుంటారు. ఈ గ్రహణాన్ని చూసిన వారిలో చాలామంది కంటి చూపు కోల్పోయారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. మరి ఈ గ్రహణం ఎప్పుడు వస్తుందో.. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలోనని బాధపడుతున్నారా.. అయితే దీనిని చదవండి..ఏ గ్రహణం ఏర్పడిన దానికి తగిన నియమాలు, జాగ్రత్తలు పాటించాలని పురాణాలు చెప్తున్నాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, కొన్ని నక్షత్రాలు, రాశులు వారు ఈ గ్రహణాన్ని చూడరాదని పండితులు చెబుతున్నారు.

గ్రహణం ఏర్పడిన వెంటనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా.. గ్రహణం పూర్తయిన తరువాత.. ఇంటిని శుభ్రం చేసుకుని.. ఇంట్లోని ప్రతిఒక్కరూ తలస్నానం చేసే మీరు ప్రార్థించే దైవానికి పూజలు చేయాలి. అలానే గర్భిణి స్త్రీలు గ్రహణ సమయంలో అటూఇటూ కదలకుండా ఒకేచోట ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లకూడదు. ఈ గ్రహణాన్ని గర్భిణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి.

ఎందుకంటే కడుపులోని శిశువుపై ఆ చంద్రుని కిరణాలు పడకూడదనేది విశ్వాసం. ఒకవేళ పడితే ఆ శిశువు పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ, అందువలన గ్రహణానికి ముందే గర్భిణులు నిద్రిస్తే మంచిది. ఆపై గ్రహణం పూర్తయిన తరువాత తలస్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజలు చేయాలి. ఈ నియామాలు పాటిస్తే.. గ్రహణ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Content above bottom navigation