తెలుగు రాష్ట్రల్లో పరిస్థితి ఇది ఈ అమ్మాయి మాటలు వింటే

కూరగాయల ధరలు పెంచితే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వ్యాపారులు పెడచెవిన పెడుతున్నారు. చివరకు బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసే వారాంతపు సంతలో కూడా అధిక ధరలకు విక్రయించారు. కేజీ టమాట 10 నుంచి 14రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో 25 నుంచి 40రూపాయలకు అమ్మకాలు సాగించారు. పచ్చిమిర్చి రూ.23గా నిర్ణయించగా మార్కెట్‌లో ఏకంగా 60రూపాయలు పలికింది. అదేమని అడిగితే హోల్‌సేల్‌ ధరలు పెరిగాయి ఏం చేయమంటారు అని వ్యాపారులు చెబుతున్నారు. ఆలుగడ్డ 20 రూపాయలకు కేజీగా నిర్ణయించారు. కాగా భరత్‌నగర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో 40రూపాయల కేజీ పలికింది. రెండింతలు పెరిగిన ధరలకు కూరగాయలను కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఆ ధరను మరింత పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం కట్టడి చేయకపోతే నగరవాసులపై ఆర్థిక భారం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. 

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

ప్రభుత్వం టమాట  ధరను గరిష్టం రూ.14 నిర్ణయించగా కిలోకు రూ.80, వంకాయలు గరిష్టం రూ.20 ఉండగా రూ.70, బెండకాయలు గరిష్టం రూ.25 ఉండగా రూ.80, కాకరకాయ రూ.23 ఉండగా రూ.60, పొట్లకాయ రూ.35 ఉండగా రూ.60, కాలీఫ్లవర్‌ రూ.15 ఉండగా ప్రస్తుతం రూ.50, క్యాబేజీ రూ.14 ఉండగా రూ.50,  క్యారెట్‌ రూ.28 ఉండగా అందుబాటులో లేదు. దొండకాయలు రూ.20 ఉండగా రూ.80, బంగాళదుంప రూ.20 ఉండగా రూ.60, ఉల్లి కేజీ రూ.28 ఉండగా ప్రస్తుతం వందకు 3కిలోలు, చిక్కుడు కిలో రూ.27 ఉండగా రూ.80, దోసకాయ అందుబాటులో లేదు. అరటికాయ జత రూ.14 ఉండగా డజన్‌కు రూ.60, బీన్స్‌ రూ.18 ఉండగా అందుబాటులో లేవు. మునగకాయ కేజీ రూ.37 ఉండగా ఒకటి రూ.10, బీట్‌రూట్‌ అందుబాటులో లేవు. కీర దోస కిలోకు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.45, ప్రెంచ్‌ బీన్స్‌ అందుబాటులో లేవు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

INDIAN FARMERS MARKET || Fresh Fruit and Vegetables || Selling and ...

అల్లం కిలో రూ.90 ఉండగా రూ.200, గోల్కొండ చిక్కుడు రూ.22 ఉండగా రూ.80, ముల్లంగి అందుబాటులో లేదు. వెల్లుల్లి కేజీ రూ.92 ఉండగా రూ.220, కొబ్బరికాయ ఒకటి గరిష్టం రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30, అరటిపండు ఒకటి గరిష్టం రూ.4ఉండగా డజన్‌కు రూ.80గా విక్రయాలు చేశారు. బియ్యం, పప్పు దినుసుల ధరలు కూడా పెంచేశారు.  గతంలో బియ్యం ధర కిలో రూ.40, 45, 50, 55 ఉండగా ప్రస్తుతం వాటిని రూ.45, 50, 55, 60కి విక్రయిస్తున్నారు. కందిపప్పు, పెసరపప్పు, చింతపండు తదితర సామగ్రిపై కూడా కిలోకు రూ.3నుంచి రూ.5 ఎక్కువ ధరకు  అమ్ముతున్నారు. సికింద్రాబాద్‌లోని కాలనీలు, బస్తీల్లోని హోల్‌సేల్‌, కిరాణా దుకాణాలన్నింటిలోనూ ఇదే తంతు సాగుతోందని, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌, గండిపేట్‌, శంషాబాద్‌ మండలాల్లో ఎవరైనా అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయించినట్లయితే 18002331077 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ సూచించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడలో ఉన్న రెండు దుకాణాల్లో ప్రభుత్వం సూచించిన ధరలకంటే అధికంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలను విక్రయిస్తున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఆమె  ఏసీపీ అశోక్‌ చక్రవర్తితో కలిసి ఆ దుకాణాలను తనిఖీ చేశారు.ఆ దుకాణాల సిబ్బందిని మందలించారు. కంప్యూటర్లలో పొందుపరిచిన వస్తువుల ధరలను ప్రభుత్వం సూచించిన ధరలకు మార్పించారు. ప్రభుత్వం సూచించిన ధరల పట్టికను ఆ దుకాణాల ఎదుట అంటించారు. ఇక మీదట నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా నిత్యావసరాలకు.. కూరగాయలకు ఇబ్బంది లేదని, అలా అని రేట్లు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బేగంపేట కార్పొరేటర్‌ ఉప్పల తరుణి హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు తాళ్ల రాజయ్యతో కలిసి డివిజన్‌లోని ప్రకాశ్‌నగర్‌లో ఆమె పర్యటించారు.  

Content above bottom navigation