క‌రోనా ఎఫెక్ట్.. చైనా సెల్ ఛార్జ‌ర్లు బ్యాట‌రీలు వాడుతున్నారా అయితే మీకు డేంజ‌ర్ న్యూస్

క‌రోనా పేరు చెబితే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి..ఇది ఆరోగ్యానికే కాదు వారి ఆర్దిక మూలాల‌పై కూడా దెబ్బ‌తీస్తోంది.క‌రోనా ఎఫెక్ట్ తో ఇక తమ దేశం ఎలా ముందుకు వెళుతుందా అని చైనా బెంబెలెత్తిపోతోంది.
దాదాపు ఒక్క‌రోజులేనే 27 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద స్టాక్స్ ఆవిరి అయ్యాయి. ఇలా వ్యాపారాలు లేక కంపెనీలు మూత‌బ‌డి 20 కోట్ల మంది స‌రిగ్గా ప‌నులు చేయ‌డం లేదు.కొన్ని స్కూల్స్ కాలేజీలు మూత‌ప‌డి ఏకంగా 20 రోజులు అవుతోంది.ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారు. అయితే ఈ కరోనా దెబ్బ మానవులనే కాదు.. మార్కెట్లను కూడా వణకిస్తోంది అని అంద‌రూ ఒప్పుకుంటున్నారు. వివిధ ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడిన దేశాలు ఎటూ పాలుపోని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. చైనా దిగుమతులకు అలవాటు పడ్డ దేశాలకు షాక్‌ తగిలేలా ఉంది. ముఖ్యంగా మన దేశంపై ఇప్పటికే ఆ ప్రభావం పడిందనే చెప్పాలి.

కరోనా వైరస్

సెల్‌ఫోన్‌ సామ్రాజ్యంలో దీని ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. సెల్‌ఫోన్‌ స్పేర్‌ పార్ట్స్‌ కోసం దాదాపు 99 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి అన్ని రకాల స్పేర్‌ పార్ట్సుపైన 10 నుంచి 25 శాతం ధరలు పెరగనున్నాయని, దానిని బట్టే వినియోగదారులతో బేరసారాలు సాగించుకోవాలని వ్యాపారులు బుధవారం తమ ఖాతాదారులకు సందేశాలు పంపారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచే రిటైల్‌ వ్యాపారులు ధరలు పెంచుకుని కూర్చున్నారు. అదేమంటే కరోనా అంటున్నారు.చైనా నుంచి పూర్తిస్థాయిలో దిగుమతులు నిలిచిపోయాయని, దీంతో మన దేశంలో తయారయ్యే వస్తువులపైనే ఆధారపడాలని, భవిష్యత్తులో మరింత పెరగవచ్చని భయపెడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్టాకులను రేట్లు పెంచుకుని అమ్మే పనిలో హోల్‌సేల్‌ వ్యాపారులు ఉన్నారు. మరో పది రోజుల వరకే స్టాకులు ఉన్నాయి. ఈ క్రమంలో దీనిని అవకాశంగా మల్చుకునేందుకు స్టాకిస్టులు పక్కా ప్రణాళిక రచించారని సమాచారం.

ఈ క్రింది వీడియోని చూడండి

మరో నెల రోజుల వరకు కరోనా ప్రభావం ఇలాగే ఉంటే సెల్‌ఫోన్‌కు సంబంధించి చార్జర్లు, బ్యాటరీలు, 40 రకాల స్పేర్‌పార్ట్స్‌ అన్నింటి ధరలు రెట్టింపు కావచ్చని చెబుతున్నారు. కొత్త సెల్‌ఫోన్లపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే జనాదరణ ఉన్న బ్రాండ్‌లు చైనా నుంచి కాకుండా దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్‌ నుంచి వస్తుండడం వల్ల ఫోన్ల రేట్లు ఇప్పుడే పెరగకపోవచ్చని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌లో 90 శాతం చైనా వస్తువులే అమ్ముతున్నారు. స్థానిక తయారీ కన్నా 50 శాతానికి పైగా ధర తక్కువగా రావడంతో ఎక్కువ రకాలు చైనాపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ వారం రోజుల్లో వాటి పై కూడా ప్రభావం పడి ధరలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా హ‌ర్డ్ వేర్ టెక్నాల‌జీ వ్యాపారులు స‌రుకు బాగా నిల్వ చేస్తున్నార‌ట‌.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation