ట్రంప్‌ కు ప్రధాని మోదీ ఇవ్వబోయే స్పెషల్ గిఫ్ట్ ఇదే..

86

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకనుంది.అయితే అమెరికా అధ్యక్షుడు భారత్‌ లో పర్యటించడమంటే ఆశామాషి వ్యవహారం కాదు. అందులో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కు ట్రంప్‌ రావడంతో అక్కడి ప్రభుత్వం ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది.. ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

అలాగే ఈ పర్యటనపై రెండు ప్రభుత్వాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇండియాతో ట్రేడ్ డీల్ పై అమెరికా ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ట్రంప్, వాషింగ్టన్ డీసీ నుంచి నేరుగా ఈనెల 24న అహ్మదాబాద్ లో ల్యాండవుతారు. గుజరాత్‌ టూర్‌లో భాగంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 24న 22 కిలోమీటర్ల మేర కొనసాగే రోడ్‌ షోలో పాల్గొంటారు. 50 వేలకు పైగా బీజేపీ కార్యకర్తలు వీరికి స్వాగతం పలకనున్నారు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమానికి వెళతారు. అక్కడి నుంచి మోతెరాలోని నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియంకు చేరుకుంటారు. ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమానికి వెళ్తారు. మొదటిసారి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ఆయనకు ప్రత్యేక గిఫ్టులు అందజేయబోతున్నట్లు ట్రస్టీలు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని అమెరికా అధ్యక్షుడు సందర్శించడం తొలిసారి కావడంతో ట్రంప్ కు మర్చిపోలేని బహుమతుల్ని ఇవ్వబోతున్నట్లు సబర్మతి ఆశ్రమ ట్రస్టీ అమృత్ మోదీ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

Image result for trump modi

నూలు వడికే చెరఖా నమూనా, మహాత్ముడి జీవితానికి సంబంధించిన రెండు పుస్తకాలు, ఒక చిత్ర పటాన్ని ట్రంప్ కు గిఫ్టుగా ఇవ్వనున్నట్లు అమృత్ మోదీ చెప్పారు. ఆ రెండు పుస్తకాల్లో ఒకటి గాంధీజీ ఆత్మకథ ‘మై లైఫ్ మై మెసేజ్’ ఒకటని తెలిపారు. సబర్మతి ఆశ్రమానికి వచ్చీ రాగానే ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు నూలు దండలతో స్వాగతం పలుకుతామని ట్రస్టీలు తెలిపారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ-కస్తూర్బాలు కలిసి జీవించిన కాటేజీ లోపలికి ట్రంప్, మెలానియా వెళతారని, గాంధీజీ స్వహస్తాలతో నూలు వడికిన చెరఖాను కూడా తాకనున్నారని సమాచారం. ఈ పర్యటన ఆద్యంతం అతిథుల వెంట ప్రధాని మోదీ కూడా ఉండనున్నారు. హ్యూస్టన్ లో ‘ హౌడీ మోదీ ‘ తరహాలో అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో ‘ నమస్తే ట్రంప్ ‘ కర్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు షోతో పాటు నమస్తే ట్రంప్ ఈవెంట్లకు కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈనెల 24న అహ్మదాబాద్ లో 3 గంటలు గడపనున్న ట్రంప్ తర్వాత ఢిల్లీకి వెళతారు. 25న రాష్ట్రపతిని కలిసి, మరోసారి మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాల్ని చర్చిస్తారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation