కొత్త రెవెన్యూ చట్టం..! ఇప్పుడు తెలంగాణ అంతటా దీని గురించే చర్చ జరుగుతోంది. కొత్త చట్టంలో ఏముంది? తమ సమస్యలు ఎలా తీరుతాయి? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయేతర భూములను ఎలా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారో అసెంబ్లీ వేదికగా వివరించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 590 మంది ఎమ్మార్వోలు ఇకపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారు.
వీళ్ళే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు. సబ్ రిజిస్ట్రార్లు యథావిధిగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేస్తారు.