జగన్ తో మీటింగ్ కి చిరు నాగ్ వస్తున్నారు .. బాలయ్యకి కాల్ చేస్తే ఏమన్నారంటే ?

93

బాల‌య్య బాబు బ‌ర్త్ డే ఈ నెల 10 న జ‌ర‌గ‌నుంది, అయితే అర‌వై జ‌న్మ‌దినం కావ‌డంతో ష‌ష్టి‌పూర్తి ప్లాన్ చేస్తున్నారు కుటుంబ స‌భ్యులు, ఈ స‌మ‌యంలో మెగా స్టార్ చిరంజీవితో స‌హా ప‌లువురు అగ్ర‌హీరోల‌ను నిర్మాత‌ల‌ను ద‌ర్శ‌కుల‌ని కూడా పిల‌వాలి అని చూస్తున్నారు బాల‌య్య‌, అయితే ఈ ఫంక్ష‌న్ కు మెగా బ్ర‌ద‌ర్స్ వెళ‌తారా అనేది ఇప్పుడు డౌట్

టాలీవుడ్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న వార్తలు వరుసగా హల్ చల్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

అయితే వాటిన్నింటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. బాలయ్యఈ ఏడాది 60వ వడిలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు బాలయ్యకు షష్టిపూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఈవెంట్ ని బలంగా చేయాలని అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ వేడుకలో భాగంగా బాలయ్య నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విందుకు నందమూరి కుటుంబంతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ ఈవెంటుకు చిరంజీవి కూడా రాబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవును… తన స్పెషల్ బర్త్ డే వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ ప్రముఖులను పిలవాలని భావించారు బాలయ్య. అయితే ప్రముఖుల్లో చిరంజీవిని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు బాలయ్య.

.

Content above bottom navigation