దివాక‌ర్ బ‌స్సుల్లో వ్య‌భిచారం వెలుగులోకి న‌మ్మ‌లేని నిజాలు

56

ఈ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. వారే జేసీ బ్రదర్స్‌ (జేసీ దివాకర్‌రెడ్డి– జేసీ ప్రభాకర్‌రెడ్డి) వ్యాపార సామ్రాజ్యమంతా అవినీతి, అక్రమమేనని తాజాగా ఆరు నెల‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గత తెలుగుదేశం పాలనలో మరీ చెలరేగిపోయారు అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్ట్, అసాంఘిక కార్యకలాపాలు, మాన్యం భూముల ఆక్రమణ తదితర వాటి ద్వారా గత ఐదేళ్లలో రూ.2900 కోట్ల మేర దోపిడీ చేశారు అని అధికార పార్టీ విమ‌ర్శిస్తోంది.

దివాక‌ర్ బ‌స్సుల్లో వ్య‌భిచారం కూడానా..?

తాజాగా ఈ బ‌స్సుల ముసుగులో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రిగాయ‌ట‌…దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలు 2012లో వెలుగులోకి వచ్చాయి. అప్పటి రవాణా శాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య మహబుబ్‌నగర్‌ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు రవాణా శాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు – హైదరాబాద్‌ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సులో మొబైల్‌ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి.. ఆ బస్సును కూడా సీజ్‌ చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేని బస్సులను పదుల సంఖ్యలో సీజ్‌ చేశారు. జేసీ సోదరులు అధికార బలంతో రవాణా శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఒక పర్మిట్‌ నంబర్‌పైనే పలు రూట్లలో అనధికారికంగా బస్సులు నడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ల నిర్వహణపై నిఘా అధికమైంది. దీనికి తోడు దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. ఈ ట్రావెల్స్‌ అక్రమాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. అయితే గ‌తంలో ఇలా బ‌స్సుల్లో వ్య‌భిచారం జ‌రిగింది అని వార్తలు వ‌చ్చాయి… మ‌రి ఇప్పుడు ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయా లేదా అనేదానిపై విచార‌ణ కూడా చేస్తున్నారట‌.ఏదైనా ఆ ఓన‌ర్ల‌కు తెలియ‌కుండా ఇది జ‌రిగినా క‌చ్చితంగా కింది స్ధాయి ఉద్యోగులు త‌ప్పు ఉంటుంది …అయితే య‌జ‌మానులుగా ఇలాంటి కార్య‌క‌లాపాలు జ‌రుగ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త క‌చ్చితంగా వారిపై ఉంటుంది అంటున్నారు పోలీసులు ర‌వాణా శాఖ అధికారులు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation