కరోనా ఎఫెక్ట్‌తో పట్టణాలు, సిటీలు, రాష్ట్రాలు, దేశాలు.. ఇలా ప్రపంచం మొత్తం లాక్డౌన్ అవుతోంది… కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన నిర్ణయాలకు తీసుకుంఉటన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ కోసం కాదు.. మాకేం అవుతుంది.. అన్నట్టుగా లైట్‌గా తీసుకుంటున్నారు. రోజూ లాగే.. బైక్‌లు, కార్లు వేసుకుని రోడ్డెక్కుతున్నారు. అయితే, దీంతో ప్రశాంతంగా ఉండే అధికారులకు సైతం చిర్రెత్తుకొస్తోంది..
రోడ్డుపైకి వచ్చిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్. వాహనాలపై వెళ్లే వారిని ఆపి.. ఏంటి బయటకు ఎందుకు వచ్చారు? నువ్వు ఏమైనా గొప్పోడివా? నీకు ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా? అంటూ.. కార్లు, బైక్‌లు ఇలా తేడా లేకుండా ఆపి క్లాస్ తీసుకున్నారు.. అటుగా వెళ్తున్న ఓ ఫ్యామిలీని సైతం ఆపి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్.. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ గారు కోపపడడంలో తప్పులేదు కదా అంటున్నారు నెటిజన్లు… ఓవైపు మాయదారి వైరస్ కమ్ముకొస్తుంటే.. పౌరులు బాధ్యతతో నడుచుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అంతా కలిసికట్టుగా సహకరించాల్సిందే.. అప్పుడే.. దారి బారిన పడకుంటా ఉండగలుగుతారు మరి.