రతన్ టాటా భారీ విరాళం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా

రోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశీ పారిశ్రామిక దిగ్గజాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్, రతన్ టాటా ఇలా వీరి జాబితాలోకి మరో దిగ్గజ సంస్థ కూడా వచ్చి చేరింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ తాజాగా కరోనాను ఎదుర్కోవడానికి ఏకంగా రూ.1,000 కోట్ల సాయాన్ని ప్రకటించింది.టాటా సన్స్ కన్నా ముందుగా టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా కూడా కరోనాను ఎదుర్కోవడానికి రూ.500 కోట్ల విరాళం అందించారు. ‘కరోనాను ఎదుర్కోవడానికి టాటా ట్రస్ట్స్, మా గౌరవ చైర్మన్ రతన్ టాటాతో కలిసి పనిచేస్తాం. టాటా ట్రస్ట్స్ కార్యక్రమాలకు మా పూర్తి మద్దుతు ఉంటుంది’ అని టాటా సన్స్ పేర్కొంది. ఇంకా వెంటిలేటర్లు కూడా అందిస్తామని తెలిపింది.

My account was hacked, didn't tweet Modi-Ambani joke, says Ratan ...

ఇకపోతే అందరి కన్నా ముందుగా కరోనాను ఎదుర్కోవడానికి రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అని ప్రకటించారు వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ట్విట్టర్ వేదికగా ఈయన ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.100 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆయన పెద్ద మనసుతో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం.మరోవైపు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం మహీంద్రా కంపెనీలో వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీల్లో వెంటిలేటర్ల తయారీ సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

అంతేకాకుండా మహీంద్రా హాలిడేస్ సంస్థ తన రిసార్ట్స్‌ను మెడికల్ కేర్ సెంటర్లుగా ఉపయోగించుకునేందుకు అంగీకారం తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు. అంటే కరోనా వైరస్ సోకిన వారికి ఈ రిసార్ట్స్‌లో వైద్యం అందించొచ్చు. అలాగే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారిపై కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ పడితే.. వారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా మహీంద్రా ఫౌండేషన్ ద్వారా ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా వారికి సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ ఫండ్‌కు ఆనంద్ మహీంద్రా తన 100 శాతం శాలరీని విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

Content above bottom navigation