‘ఉదయ్ కిరణ్’ మరణం పై సంచలన నిజాన్ని బయటపెట్టిన ప్రముఖ నిర్మాత….!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చిత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్న ఆ సినిమాలో ఉదయ్ సరసన రీమా సేన్ హీరోయిన్ గా నటించగా తేజ దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరొక్కసారి తేజ దర్శకత్వంలో ఆయన నటించిన నువ్వు నేను, అలానే విఎన్ ఆదిత్య దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మనసంతా నువ్వే సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించి, అప్పట్లో యువతలో ఉదయ్ కిరణ్ కు విపరీతమైన పేరు, క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇక అదే ఊపులో ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తరువాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన ఉదయ్ ను.

Image result for uday kiran

తమ ఇంటి అల్లుడు గా చేసుకోబోతున్నట్టు మెగాస్టార్ చిరు సంచలన ప్రకటన చేసారు. దానితో అతడికి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే ఆ తరువాత కొన్ని అనుకోని కారణాల వలన చిరు కుమార్తెతో ఉదయ్ వివాహం ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఉదయ్ కిరణ్ కు వచ్చిన ఆఫర్లు కూడా చాలావరకు చేజారిపోయాయి. దానితో కొన్నాళ్ల తరువాత మానసికంగా కృంగిపోయిన ఉదయ్, చివరికి 2014లో ఆత్మ హత్య చేసుకున్నాడు. అయితే ఈ విధంగా ఉదయ్ కిరణ్ కెరీర్ దెబ్బతినడానికి మెగాస్టార్ ఒకింత పరోక్షంగా కారణమని అప్పట్లో కొందరు విమర్శలు చేసారు. కానీ, అటువంటిది ఏమి లేదని, తన కుమార్తెతో వివాహం ఆగిపోయిన తరువాత కూడా అనేకమార్లు మెగాస్టార్ తమ ఇంటికి విచ్చేయడంతో పాటు ఉదయ్ సినిమాల విషయమై కూడా అనేకమార్లు ఆయన సలహాలు, సూచనలు చేసినట్లు ఉదయ్ అక్క శ్రీదేవి కూడా చెప్పడం జరిగింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation