సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం ప్రతి ఒక్కరినీ ఎంతగానో బాధించింది. తోటి నటీనటులు ఆయన మరణవార్తని మర్చిపోలేకపోతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సైతం జయప్రకాష్ మృతి చెందడం తీరని లోటు అన్నారు. అయితే ఈ సీనియర్ నటుడికి అకస్మాత్తుగా మృతి చెందడానికి అసలు కారణం తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమేనని తెలుస్తోంది.
నెగిటివ్ రోల్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన జయప్రకాష్ రెడ్డి కమెడియన్ గా కూడా అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సరే తనదైన శైలిలో చేసి మెప్పించే సత్తా ఉన్న జయప్రకాష్ స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాటకాలు అంటే ఆయనకు అమితమైన ఆసక్తి.