అచ్చెంనాయుడు అరెస్ట్ వెనుక కారణం ఇదే.!

125

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ACB అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2020, జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈఎస్ఐ కుంభకోణంపై గతంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిదే. DIMS డైరెక్టర్ వాంగ్మూలంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మందులు, పరికరాల కొనుగోలులో రూ. 151 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

కార్మిక శాఖ మంత్రిగా : –
చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించారు. అందులో కార్మిక శాఖలోని ESI స్కాం వెలుగు చూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

టెలీ హెల్త్ సర్వీసుల పేరిట : –
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్లో తేలింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో అవినీతి జరిగిందని ఇందులో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని గుర్తించిన అధికారులు ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు.

Content above bottom navigation