వర్మ దిశా సినిమాలో నటిస్తున్న చెన్నకేశవులు భార్య రేణుక ?

161

తెలంగాణలో గత ఏడాది జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఘటన తర్వాత యావత్తు భారతావని హర్షించింది. దేశంలో ఇంకొక ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయం పుట్టించేలా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఈ క్రింది వీడియో చుడండి

ఇక దిశ హత్య ఘటనను సినిమాగా తీయబోతున్నా అని వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాడు. శంషాబాద్ లో తిరుగుతున్న వర్మ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిసిన ఆర్జీవీ పలు విషయాలను చర్చించారు. దిశా అత్యాచారం జరిగిన తర్వాత, ఇంటికి వచ్చిన చెన్నకేశవులు బిహేవియర్ ఎలా ఉంది, ఆరోజు ఇంటికి పోలీసులు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మీడియా వ్యవహరించిన తీరు గురించి కూడా పూర్తీగా అడిగి తెలుసుకున్నారు. రేణుక నుంచి చాలా ముఖ్యమైన కీలకాంశాలను సేకరించారు. అలాగే మొన్న ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన శంషాబాద్ ఏసిపిని డైరెక్ట్‌ గా రామ్‌ గోపాల్ వర్మ కలిశారు. ఏసిపిని కలిసి ఎన్ కౌంటర్ గురించి పూర్తీ సమాచారం సేకరించారు. ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్‌కౌంటర్ వరకు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకొక వారంలో ఈ సినిమాను స్టార్ట్ చేయ్యనున్నాడు వర్మ.

Image result for rgv disha movie

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటి అంటే. దిశా ఇన్సిడెంట్ మీద తీస్తున్న సినిమాలో నిందితులలో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక నటిస్తుందంట. ఇప్పుడు ఇదే టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నార్మల్ గా ఆర్జీవీ సినిమా అంటే అందులో నటించే క్యారెక్టర్స్ రియలిస్టిక్ గా ఉంటారు. వంగవీటి సినిమా తీసుకున్న, ఎన్టీఆర్ బయోపిక్ తీసుకున్న, మొన్నటికి మొన్న వచ్చిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు తీసుకున్నా, ఈ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ ను అలాగే తీసుకోబోతున్నాడు. అయితే చెన్నకేశవులు భార్య రేణుక పాత్ర ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, ఆమె పాత్రలో ఆమె నటిస్తేనే బాగుండు అనే ఆలోచన అర్జీవికి వచ్చిందంట. వెంటనే రేణుకను అడగడం, ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. ఆమె సినిమాలో నటిస్తుందన్న విషయాన్నీ ఆర్జీవీ చాలా సీక్రెట్ గా దాచిపెట్టాడు. ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. చూడాలి మరి దిశా సినిమాను వర్మ ఏ విధంగా తెరకెక్కిస్తాడో. ఇక దిశా సినిమా విషయంలో దిశా తల్లిదండ్రులను కలుస్తాను అని రెండుమూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ దిశ తల్లిదండ్రులను తాను కలవబోనని వర్మ మీడియాకు చెప్పాడు.. దిశ ఘటనపై తీయబోయే చిత్రానికి ఎవరి అనుమతి అవసరం లేదంటున్నారు వర్మ. త్వరలో మరికొందరు పోలీస్‌ అధికారులను కూడా కలుస్తానన్నారు. తాను సేకరించిన సమాచారన్నంతా సినిమా స్క్రీన్ ప్లే రాసుకుంటానన్నారు. ఈ సినిమాను వర్మ ఎలా తెరకెక్కిస్తాడు, ఏయే అంశాలను ఇందులో ఆవిష్కరిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation