చేన్నకేసవులు భార్యకు కూతురు పుట్టిందని తెలియగానే RGV చేసిన పని తెలిస్తే షాక్

తెలంగాణలో గత ఏడాది జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఘటన తర్వాత దిశా కుటుంబ సభ్యులే కాదు నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇక ఈ ఎన్ కౌంటర్ వలన ఎక్కువగా నష్టపోయింది నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక. ఇన్ కౌంటర్ జరిగినప్పుడు రేణుక గర్భిణీ. అయితే ఇప్పుడు ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈమెకు సహాయం చెయ్యాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ద్వారా కోరుతున్నాడు. దానికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సాయం అందించాలని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరారు. రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, వారి భవిష్యత్తు కోసం విరాళం అందించాలని రాంగోపాల్ వర్మ కోరారు.

ఈ సందర్భంగా ఆ‍యన ట్వీట్ చేశారు .”చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రేణుక, ఆమె బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే, రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుడదు. దయచేసి ఎవరికి వారికి సాయం చేయండి అని వర్మ ట్వీట్‌ చేశారు. Action Aid for societal Advancement AASA‌(ఏఏఎస్‌ఏ) అకౌంట్‌ నంబరును ట్వీటర్‌ లో షేర్‌ చేసి ఎవరికి తోచిన సాయం చేయాల్సిందిగా కోరారు.

Image result for చెన్నకేశవుల భార్యకి సాయం

ప్రస్తుతం దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించిన విచారణ కోర్ట్ లో కొనసాగుతోంది. దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆయన ఇటీవల కలిశారు. ఆమె నుంచి చాలా విషయాలు సేకరించిన వర్మ, ఆమెకు కొంత ఆర్థిక సహాయం కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎంత మొత్తంలో డబ్బు వచ్చిందనేది తెలియలేదు. అలాగే దిశా సినిమా విషయం మీద పలువురు పోలీసు అధికారులతో కూడా భేటీ అయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో అసలేం జరిగింది అనే విషయాల గురించి పూర్తీగా తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాను స్టార్ట్ చేశాడు వర్మ. తొందర్లోనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

Content above bottom navigation