ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ డ్రెస్ చించేసి ఎంత ఘోరానికి పాల్పడ్డాడో చూడండి

201

ఆర్టిసి బస్సులో డ్రైవర్స్, కండక్టర్స్ ప్రయాణికులతో ఎన్ని ఇబ్బందులు పడతారో మనకు తెలుసు. ముఖ్యంగా కండక్టర్లకు ప్రయాణికులు చుక్కలు చూపిస్తారు. అందులో మహిళా కండక్టర్లు అయితే మగాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. గతంలో మగ ప్రయాణికుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పలువురు మహిళా కండక్టర్లు పిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు మరొక మహిళా కండక్టర్ కు ఇలాంటి ఘటనే ఒక ఎదురైంది. టికెట్ తీసుకోమని అడిగిన పాపానికి మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు ఒక ప్రయాణికుడు. ఆమె డ్రెస్ చించేసి.. ప్రయాణికులు అడ్డుకున్నా వదలకుండా హంగామా స్పృష్టించాడు.. నిందితుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌ పై దాడి కలకలం రేపింది. మదనపల్లె డిపోకు చెందిన బస్సు గుర్రంకొండ, తరికొండల మధ్య నడుస్తోంది. మంగళవారం బస్సులో మహిళా కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బస్సులో ప్రయాణికులు అందరికి టికెట్లు ఇచ్చింది. శివారెడ్డి అనే వ్యక్తి మాత్రం టికెట్ తీసుకోలేదు. ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ అతడ్ని ప్రశ్నించింది. టికెట్ తీసుకోమని అడిగింది. కోపంతో ఊగిపోయిన శివారెడ్డి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.. అంతటితో ఆగకుండా ఆమె డ్రెస్ చింపేశాడు. ఈ గొడవ ఎక్కువ అవ్వడంతో బస్సు డ్రైవర్ బస్సును అక్కడే ఆపేశాడు. ప్రయాణికుడు దాడి చేయడాన్ని గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం వెనక్కు తగ్గలేదు.. మహిళ అని కూడా చూడకుండా చెయ్యి చేసుకున్నాడు. ప్రయాణికుడి చేతిలో గాయపడిన కండక్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు.

Image result for మహిళా కండక్టర్ డ్రెస్ చించేసి

చివరికి ప్రయాణికుంతా కలిసి శివారెడ్డిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. మహిళా కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు స్వలంగా గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. కండక్టర్‌ పై ప్రయాణికుతు దాడి చేయడంతో.. ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడ్డాయి. దాడి చేసిన వ్యాక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Content above bottom navigation