కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ పనిలో నిమగ్నమయ్యాయి. పరిశోధకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ను చంపి.. రోగిని కాపాడే క్రమంలో కొన్ని ఔషదాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని కేసుల్లో రోగులను కాపాడలేక చేతులెత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే, రోగుల సంఖ్య క్రమేనా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాలు, చికిత్స ఇతరాత్ర సేవలు ఇప్పుడు దయనీయంగా మారాయి.
ఈ స్థితిలో హాస్పిటల్కు వెళ్తే బాధితుడికి నరకయాతన తప్పదు. కాబట్టి.. మనకు మనమే జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనాకు దూరంగా ఉండాలి. మరోవైపు శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవాలి. ఇందుకు రోజూ వేడి నీళ్లు తాగడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. దీనికి బలం చేకుర్చుతూ రష్యా పరిశోధకులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో చూసేద్దామా మరి.