సౌదీలో కలకలం.. రాజకుటుంబంలో 150 మందికి కరోనా

29

సౌదీలో రాజ‌కుటుంబానికి చెందిన 150 మంది వైరస్ బారినపడినట్టు పలు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు రావడం కలకలం రేపుతోంది. రియాద్ గవర్నర్ అయిన సీనియర్ యువరాజు ఫైసల్ బిన్ బండార్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ వైర‌స్ బారినపడి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

saudi king

రాజకుటుంబంలో మరో 12 మందికిపైగా చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు మరెంతో మంది వైరస్‌తో పోరాడుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి.. రాజ కుటుంబానికి చికిత్స చేసే కింగ్ ఫైసల్ ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయని, ఇది బయటకు రావడంతోనే వారు వైర‌స్ బారినపడిన విషయం బయటకు వచ్చిందని అంటున్నారు.

ఎన్ని కేసులు అనే విషయం తెలియదని, కాకపోతే హై అలెర్ట్‌గా ఉండాలన్నది మెసేజ్ సారాశం.. వేలాది మందిగా వున్న సౌదీ రాజులలో చాలామంది క్రమం తప్పకుండా యూరప్ పర్యటనలకు వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారికి వైరస్ సంక్రమించి ఉంటుందని, వారి ద్వారా దేశంలోకి ప్రవేశించి రాజకుటుంబం మొత్తానికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. 33 మిలియన్ల మంది ప్రజలు నివసించే సౌదీలో ఇప్పటి వరకు 2,932 కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు.

Content above bottom navigation