బ్రేకింగ్ APలో స్కూల్స్ , థియేటర్స్ బంద్..

120

దేశంలో క‌రోనా అల‌ర్ట్ న‌డుస్తోంది.ఇప్ప‌టికే దిల్లీ యూపీలో అనేక చోట్ల స్కూల్లు కాలేజీలు మూసేశారు.
ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా వేశారు.వీలైతే బ‌య‌ట‌కు పిల్ల‌ల‌కు పంప‌కండి అని చెబుతున్నారు.దేశంలో ఇప్ప‌టికే 70 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో అత్య‌వ‌స‌రంగా కేంద్రం కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.హైద‌రాబాద్ లో ఐటీ ఉద్యోగికి క‌రోనా సోక‌డం చికిత్స పొందడం తెలిసిందే.
తాజాగా ఏపీలో కూడా క‌రోనా గుబులు పెరిగిపోయింది.దీంతో పలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది ఏపీ స‌ర్కార్ మ‌రి ఏ నిర్ణ‌యాలు తీసుకుంది ? ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.ఏపీలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించడంతో జగన్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది.ఈ మేరకు విశాఖలోని కృష్ణపట్నం పోర్టు, నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Image result for schools

అటు నెల్లూరులోని పాఠశాలలకు ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటించడమే కాకుండా అన్ని థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు. ఇక మాల్స్‌ను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరగవద్దని.. బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ఇక నెల్లూరులో ఈ క‌రోనా వార్త‌లు రావ‌డంతో పిల్ల‌ల‌తో సినిమాకు షికార్ల‌కు బ‌య‌ట‌కు ఎవ‌రూ రావ‌డం లేదు, చేప‌ల‌కు ఎంతో ఫేమస్ అయిన నెల్లూరులో ఇప్పుడు చికెన్ తో పాటు చేప‌లు కూడా తిన‌డం మానేశారు, నెల్లూరులో కూడా కిలో చికెన్ 20 నుంచి 30 రూపాయ‌ల‌కు అమ్మేస్తున్నారు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

ప్రస్తుతం 9 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతుండగా.. మరో 150 మంది ఈ వైరస్ అనుమానితులు ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రెండు ప్రత్యేక వైద్య బృందాలు వీరిని పర్యవేక్షిస్తున్నారన్నారు. తెలంగాణలోని తొలి కరోనా బాధితుడు ఇటీవల గాంధీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఓప‌క్క తెలంగాణ‌లో త‌గ్గుతోంది అని వార్త‌లు వ‌స్తున్న వేళ ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి, దీంతో అంద‌రూ షాక్ అయ్యారు, జిల్లా యంత్రంగం అప్ర‌మ‌త్తం అయింది, ఎవ‌రికి అయినా జ‌లుబు ద‌గ్గు 20 రోజులు లేదా 10 రోజులు నుంచి త‌గ్గ‌క‌పోతే, క‌చ్చితంగా డాక్ట‌ర్ కు చూపించుకోవాల‌ని చెబుతున్నారు అధికారులు.ఇక ఇలాంటి ల‌క్ష‌ణాల‌తో ఎవ‌రైనా ఆస్ప‌త్రికి వ‌స్తే వారిని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి రిఫ‌రీ చేస్తున్నారు వైద్యులు, ఏపీలో మ‌రీ ముఖ్యంగా నెల్లూరు ప్ర‌జ‌లు ఈ క‌రోనా వైర‌స్ వార్త‌ల‌తో బెంబేలెత్తిపోతున్నారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation