నవంబరులో ప్రళయం.. అస్సులు తట్టుకోలేరు సైంటిస్ట్స్ చెప్పిన షాకింగ్ నిజాలు

92

చైనా దేశంలో పుట్టిన వైరస్ ప్రపంచంలో మరణ కేకలు పుట్టిస్తోంది. గత ఏడాది నవంబర్ లో బయటపడిన ఈ వైరస్ వల్ల చైనా దేశంలో బాగా ప్రాణ నష్టం జరిగింది. మనిషి నుండి మనిషికి అంటురోగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంతో మెల్లమెల్లగా ఈ వైరస్ చైనా నుండి ఇతర దేశాలకు పాకింది. దాదాపు ప్రపంచంలో 190 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది. యూరప్, అమెరికా దేశాలలో వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. దీంతో ప్రపంచ దేశాలు మందులేని ఈ వైరస్ ని ఎదుర్కొనటానికి మార్గం లేక నియంత్రణ ఒకటే కావటంతో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గింది అనుకొన్న టైములో అక్కడి డాక్టర్స్ షాక్ ఇచ్చే వార్త తెలియజేశారు. వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తి క్వారంటైన్ నుంచీ కోలుకుని వెళ్ళిన తరువాత కూడా మళ్లీ పాజిటివ్ రిపోర్ట్ వస్తుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో క్వారంటైన్ నుంచీ కోలుకుని వెళ్ళిన తరువాత కూడా పది రోజులు సదరు వ్యక్తి వద్దకు ఎవరు వెళ్లకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే టైమ్ లో చైనా శాస్త్రవేత్తలు ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని తెలియజేశారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

Curious Kids: what would happen if the Earth's core went cold?

భారతీయులకు నవంబరు తర్వాత ఈ వైరస్ నుంచి ముప్పు తప్పదని చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో వైరస్ విజృంభిస్తుందని, అందుకే ఆసియా ఖండంలో దీని తీవ్రత తక్కువని, కానీ నవంబరులోపు ఇండియా నుంచి కనుక దీనిని తరిమేయకపోతే, ఆ సమయంలో దీని తీవ్రతను తట్టుకోలేం అని చైనా భయపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది శాస్త్రీయంగా ఎంత నిజమో తెలియకపోయినా, ఈ వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. అమెరికాలోని ఎంఐటీ యూనివర్సిటీ 4-18 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటీవలే పరిశోధనలో తేల్చారు. ఇది కొంతవరకు నిజమే అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేసులను చూస్తే అర్థమవుతుంది. అయితే చలికాలం వచ్చినా కూడా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం వంటి వాటితో ఎపుడైనా దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చని అంటున్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

ఇక నవంబరు నుంచి జనవరి మధ్య దేశంలో అత్యధిక ప్రాంతాలు మన దేశంలో చల్లగా ఉంటాయి. ఉత్తరాదిన సున్నా డిగ్రీలు , అంతకంటే తక్కువకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి. దక్షిణ భారతదేశంలోను రాత్రి పూట ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీలకు పడిపోతాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు 16-25 వరకు ఉంటాయి. కాబట్టి చలికాలంలో ఇది ఇక్కడ కొనసాగితే కచ్చితంగా కొంచెం ప్రమాదం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే అన్ని రోజులు ఇండియాలో ఇది కంట్రోల్ కాకపోతే మనం దీని బారిన పడటం కంటే ముందే ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ విధంగా మనం వైరస్ కంటే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగంతో దెబ్బతినే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ లాక్ డౌన్ సమాయాన ప్రతి ఒక్కరూ కూడా నియమాలు పాటించి నవంబర్ కల్లా ఈ వైరస్ ను భారతదేశం నుంచి తరిమేదాం..

Content above bottom navigation