బాప్‌ రే : ఆ తేలు విషం కేజీ 80 కోట్లు..? దాంతో ఏం చేస్తారంటే..?

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు.. కొన్ని రోగాలను విషం తోనే నయం చేస్తారు. అలా చికిత్సకు పనికొచ్చే విషాల్లో తేలు విషం ఒకటి. తేలు కుడితే మనిషి చనిపోతాడు. అలాగని అన్ని తేళ్లూ ప్రాణాలు తియ్యలేవు. చాలా తేళ్లు కుడితే నొప్పి మాత్రమే ఉంటుంది. కొన్ని మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి. వాటి విషం మన బ్లడ్‌లో చేరిందంటే… క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది తేలు విషంతో మందులు తయారు చేస్తారంటే మీరు నమ్ముతారా..కానీ ఇది నిజం. తేలు విషం కొన్ని రోగాలకు బాగా పని చేస్తుందట. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి చికిత్సలోనూ తేలు విషయం ఉపయోగపడుతుందట.

బాప్‌ రే : ఆ తేలు విషం కేజీ 80 కోట్లు..? దాంతో ఏం చేస్తారంటే..?

సాధారణంగా తేలును చూస్తే చాలా మంది భయపడతారు. అది కుట్టిందంటే మరణించే అవకాశాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికి వెళ్తే తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపి, తనను తాను శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి తన కొండిలోని విషాన్ని ఉపయోగిస్తుంది. ఆ విషం అత్యంత ప్రమాదకరం. తేలు విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, ఎన్నో రుగత్ములకు మందుగా పని చేస్తుందట. తేళ్ళలో వేల రకాల జాతులన్నా కానీ కేవలం 25 రకాల జాతుల్లో మాత్రమే జీవులని చంపేంత విషాన్ని కలిగి ఉంటాయట. తేలు విషంలోని ప్రోటీన్‌ కీళ్ల వాపులకు, పేగు వ్యాధికి, కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. తేలు విషంతో తయారైన మందును తగిన పరిమాణంలో తీసుకుంటే, కీళ్ల సంబంధిత వ్యాధులన్ని నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ధ్రువీకరించాయట. తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది. మొత్తం 13 లక్షల మందిపై తేలు విషంతో తయారైన మందును ప్రయోగించారు. వాళ్లందరికీ ముసలితనంలో వచ్చే కీళ్లవాతం, కీళ్ల నొప్పుల వంటివి తగ్గిపోయాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇదెలా సాధ్యమంటే… తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా కీళ్ల నొప్పుల్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు. కీళ్లకు వచ్చే ఇతరత్రా వ్యాధులను కూడా తగ్గించేందుకు వీలుగా తేలు విషాన్ని మందుగా మార్చారు. అయితే ఈ తేలు విషం సేకరించడం చాలా కష్టం. అంతే కాదు.. ఒక తేలు వద్ద దొరికే విషం పరిమాణం కూడా చాలా స్వల్పం. అందుకే ఈ తేలు విషానికి రేటు ఎక్కువట. మార్కెట్లో ఒక్క గ్రాము తేలు విషం ధర 80 వేల రూపాయలు ఉంటుందట. అంటే కేజీ తేలు విషం దాదాపు 80 కోట్ల రూపాయలన్నమాట. కేవలం కీళ్ల నోప్పుల వ్యాధులకే కాకుండా ఇంకా అనేక చికిత్సల్లో తేలు విషాన్ని వాడుతారట. అందుకే ఈ తేలు విషానికి అంత డిమాండ్.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation