స్టార్ క్రికెటర్ కి కరోనా … షాక్ లో కోహ్లి

131

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

క్రికెటర్లలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్‌కి చెందిన మజిద్ హక్‌ తాను కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించాడు. పాకిస్తాన్ దేశస్థుడైన మజీద్ హాక్ స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు ఆప్ స్పిన్నర్ గా సేవలందిస్తున్నాడు. గత ఏడాది వన్డేల్లో 60 వికెట్లు పడగొట్టిన మజిద్ హక్.. ఆ దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ స్కాట్లాండ్ తరఫున 54 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లను మజిద్ హక్ ఆడాడు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండర్ ఆసుపత్రికి వెళ్లిన మజిద్ హక్.. పరీక్షలు చేయించుకున్నాడు.

Image result for mazid huck

అతని నుంచి శాంపిల్స్ సేకరించిన సిబ్బంది, పాజిటివ్ అని తేల్చారు. దీంతో ఐసోలేషన్‌లో అతను చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలాక చికిత్స తీసుకొని మెరుగైన ఆరోగ్యంతో ఇవాళ ఇంటికి వెళుతున్నా. పెయిస్లీలోని రాయల్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రి సిబ్బంది చాలా బాగా చూసుకున్నారు. ఈ సందర్భంగా నాకు మెసేజెస్‌ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా’ అని మజిద్‌ ట్వీట్‌ చేశాడు.

Image result for mazid huck

వాస్తవానికి వారం క్రితమే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌కి కరోనా వైరస్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ.. పరీక్షల్లో అతనికి నెగటివ్ అని తేలగా.. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్షల్లో అతనికీ కూడా నెగటివ్ అని వచ్చింది. కానీ తాజాగా మజిద్ హక్‌కి పాజిటివ్‌గా రావడంతో ప్రొఫెషనల్ క్రికెటర్లలో ఇదే ఫస్ట్ కేసు. ఇక కరోనా భారిన పడుతున్న లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. నిన్ననే హీరోయిన్ ఇందిరా వర్మకు, సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. వీళ్ళలాగే చాలామంది ప్రముఖులు కరోనా మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.

Content above bottom navigation