హైదరాబాద్ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్

137

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణకు పాకింది. ఇంతకు ముందు ఒక వ్యక్తికీ కరోనా పాజిటివ్ అని తెలియడంతో అతనిని గాంధీలో ఉంచి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకున్నాడు. ఈ సంతోషకర సమయంలో మరొక చెడు వార్త తెలంగాణ ప్రజలను కలవరపెడుతుంది. హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరిలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అనుమానితుల శాంపిల్స్ ను అధికారులు పూణెకు పంపారు.

Second coronavirus case confirmed in Hyderabad

కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నేడు నమోదైన ఈ కేసుతో కరోనా వైరస్‌ కేసులో తెలంగాణలో మూడుకు చేరుకున్నాయి. కాగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన మొదటి వ్యక్తికి పూర్తిగా నయమవడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధిభారిన పడ్డ మరో ఇద్దరికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 107కి చేరింది. ఈ వైరస్‌ ఇప్పటివరకు 152 దేశాలకు విస్తరించింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 5,839 మంది మృతిచెందినట్లుగా సమాచారం.

బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షా 56 వేల 730 మందికి చేరింది. కరోనా మృతుల సంఖ్య చైనాలో 3,199, ఇటలీలో 1,441, ఇరాన్‌లో 611, దక్షిణకొరియాలో 75, స్పెయిన్‌ 196, ఫ్రాన్స్‌ 91, అమెరికాలో 60కి చేరుకుంది. కరోనా కొత్త కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమవేశం నిర్వహించనున్నారు. స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మూసివేతపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర రాష్ట్రాలు తీసుకున్న చర్యలను పరిశీలిస్తున్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనాతో దేశంలో ఇద్దరు మాత్రమే చనిపోయారని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 65 మంది కరోనా బాధితుల్లో 10 మందికి కరోనాను జయించారని తెలిపారు.

హైదరాబాద్ లో మరో ఇద్దిరికి కరోనా లక్షణాలున్నాయని తెలిపసారు. పూర్తి రిపోర్టులు వచ్చాకే స్పష్టత వస్తుందన్నారు. కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగిందన్నారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా జాగ్రత్తులు తీసుకున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారే ఈ వైరస్ ను తెస్తున్నారని…విదేశాల నుంచి ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నారో తెలియదన్నారు. ప్రజలు భయపడతారని అన్ని వివరాలు తాము చెప్పటం లేదన్నారు. వారం రోజుల నుంచే తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 200 మంది ఆరోగ్య సిబ్బందిని ఎయిర్ పోర్టుతో ఉంచామని చెప్పారు.

Content above bottom navigation