నడిచే శివ లింగం ఇది చూస్తే ఆ శివుడ్ని దర్శించుకున్నట్టే

21

దేవుడిని మనం నమ్ముకుంటే ఆయనే మన వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తారు అని అనుకుంటాం, ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆయన మనకి వెనక ఉండి సాయం అందిస్తాడు అని భావిస్తాం, ఇలాంటి ఓ భక్తుడికి శివయ్య లీలలు చూపించాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూడండి.

అతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనక మిస్టరీ దాగి ఉందనేది అభిమానుల మాట. ఆమె అంతర్థానమై రెండేళ్లు అయినా ఇప్పటికీ అదే నమ్ముతారు ఫ్యాన్స్. దుబాయ్లో శ్రీదేవి మరణించిన తరువాత ఆమె భర్త బోనీ కపూర్ కలతకు గురయ్యారు. కానీ బోనీ ఆయన కుమారుడు అర్జున్ కపూర్ పై అభిమానులు రకరకాల సందేహాల్ని వ్యక్తం చేశారు. ఇకపోతే శ్రీదేవి గురించి సర్వం తెలిసిన తన మేనమామ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన సంగతులు పూర్తి కాంట్రాస్ట్ అనిపించక మానవు. శ్రీదేవి జీవితం గురించి.. తన సోదరి శ్రీలత.. సవతి కుమారుడు అర్జున్ కపూర్.. భర్త బోనీ కపూర్ గురించి.. అలాగే శ్రీదేవి సౌందర్య శస్త్రచికిత్సలు.. ఆర్థిక అస్థిరత గురించి ఎవరికీ తెలీని నిజాల్ని వెల్లడించారు.

శ్రీదేవి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి.. తాను ఎంతో బాధతో జీవించిందని.. గుండెల్లో పుట్టెడు దుఃఖం పెట్టుకుని కన్నుమూసిందని తెలిపారు. బోనీ కపూర్ కొన్ని ఫ్లాపులు తీసి చాలా డబ్బును పోగొట్టుకున్నాడు. ఆ నష్టాల్ని పూడ్చేందుకు శ్రీదేవి ఆస్తులను అమ్మారు. శ్రీదేవికి ఎప్పటికీ అదో పెయిన్ లా ఉండిపోయింది. శ్రీదేవి బాధతో జీవించి చాలా బాధతో కన్నుమూశారు. తను ఏనాడూ ప్రశాంతంగా లేదు. ప్రపంచం కోసం ఆమె ముఖంపై చిరునవ్వు ధరించిందే కానీ ఆమె తన లోనే ఎంతో మదనపడేది అని రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

బోనీ ఒక చిత్రాన్ని నిర్మించాడు. అది రిలీజ్ కి నోచుకోలేదు. అప్పటికే అతడు ఆర్థికంగా క్లిష్ట దశలో ఉన్నారు. శ్రీదేవి తన ఆస్తులను విక్రయించి.. జీవితాన్ని తిరిగి దారిలోకి తేవడానికి ఆ అప్పులను క్లియర్ చేసింది. శ్రీదేవి తిరిగి సినిమాల్లోకి రావడానికి ఇది ప్రధాన కారణమైంది అని ఆయన అన్నారు.

శ్రీదేవి మరణం వెనక మిస్టరీ ఉందని ఊహాగానాలకు దారితీసిన క్రమంలో ఈ విషయంపై కొంత స్పష్ఠతనిచ్చారు రెడ్డి. వాస్తవానికి శ్రీదేవి అప్పటికే కొన్ని ప్రలోభాలకు లోనయ్యిందని తెలిపారు. అది చాలా కాలం క్రితమేనని అన్నారు. అందం కోసం ఆమె ముక్కుపై రెండు శస్త్రచికిత్సలు చేసారు. అమెరికా వెళ్లి ముక్కుకి శస్త్రచికిత్సలు చేయించుకున్నాక మరింత అందంగా కనబడాలని కోరుకుంది. తన తల్లితో ఫోన్లో మాట్లాడితే ఆ విషయం తెలిసింది అని రెడ్డి చెప్పారు.

శ్రీదేవి తన సోదరి శ్రీలతకు మధ్య ఆస్తి వివాదం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. తోబుట్టువుల మధ్య అప్పటికి మాటల్లేవ్. అలాగే శ్రీదేవి తల్లికి యుఎస్ లో ఆపరేషన్ చేసారు. వైద్యులు ఆమె మెదడుకు ఆపరేషన్ జరగాల్సిన వైపు కాకుండా వేరొక వైపు శస్త్రచికిత్స చేశారు అందువల్ల ఆమె పూర్తిగా మంచం పట్టింది. ఆమె సజీవంగా ఉన్నా కానీ ఇంద్రియాలు పని చేయలేదు. ఆమె కేవలం ఒక వస్తువుగా మారింది“ అని తెలిపారు. శస్త్రచికిత్సలో తప్పిదం తెలిశాక ఆ అమెరికన్ ఆసుపత్రిపై కేసు పెట్టారు. ఈ ప్రక్రియలో బోనీ కపూర్ శ్రీదేవితో పాటు ఉన్నారు. కోర్టు ఆసుపత్రికి జరిమానా విధించింది.

Content above bottom navigation