ఏపీలో తాజాగా బయటపడ్డ విజయవాడ కరోనా బాధితుడు ఓ వీడియో విడుదల చేశారు. తాను ఈ నెల 16న ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చానని, అక్కడ స్క్రీనింగ్‌లో తనకు కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో మరుసటి రోజు హైదరాబాద్ వచ్చానని తెలిపారు. అక్కడి నుంచి తానొక్కడినే విజయవాడ వచ్చానని తెలిపారు. మున్సిపల్ అధికారుల సలహా మేరకు 14 రోజుల క్వారెంటయిన్లో ఉంటున్నానని తెలిపారు. ఇక విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా బాధితుడితో పాటు అతని కుటుంబసభ్యులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
జనతా కర్ఫ్యూను బెజవాడ వాసులు మరో మూడు రోజులు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని కోరుతున్నా అన్నారు కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కరోనాతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇప్పటికే విద్యార్ధి కుటుంబాన్ని ఐసొలేషన్‌లో ఉంచారు. కరోనా బాధితుడు ఎవరెవరిని కలిశాడనేదానిపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బాధితుడు వెళ్లిన కారులో మరో ముగ్గురు ప్రయాణించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. విజయవాడలో బాధితుడు దిగిపోయిన తర్వాత ముగ్గురు ప్రయాణికులు ఆ కారులో గుంటూరు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.