ఆహార పదార్దాలపై కరోనా వైరస్ ఉంటుందా? ఏయే ఆహార పదార్దాలపై ఉంటుంది? ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, ఆహారం ద్వారా కరోనా సోకదని ఇటీవలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది.
ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.