మహా శివరాత్రి రోజు ఈ ఒక్క కథ వింటే 7 జన్మల పాపాలు తొలిగిపోతాయి

56

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 వ తేదీన వచ్చింది. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. శివరాత్రి దినాన శివున్నీ “జ్యోతిర్లింగరూపం” లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది, అంతం లేదు. శివరాత్రికి సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ..ఇలా చాల కథలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క కథ విన్నా మనకు చాలా మంచిదంట. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

“ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరించు సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేసేవాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తాను ఒక లేడిని చంపినా కూడా, ఇంటికి తీసుకెళ్ళే మార్గం ఆ చీకటిలో కనిపించలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలలు వెయ్యడంతో, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక ఎంత బాధపడుతున్నారో అని తలచుకొని బాధపడ్డాడు..

Image result for mahashivratri

రాత్రి నిద్ర పొతే జంతువుల నుంచి ప్రమాదం ఉన్నదని, నిద్ర రాకుండ ఉండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తాను ఆహారం తీసుకొడానికి కూర్చునే సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు. కొంతకాలానికి ఆ వేటగాడు చనిపోయాడు. శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తీసుకొని పోయారు. అక్కడ అతడికి తాను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకుండానే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. ఆ మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తాను సేవించాడు. అంటే అతనికి తెలియకుండానే అతను మహాశివరాత్రి రోజున లింగానికి పూజ చేసి మంచి ఫలితాన్ని పొందాడు. కాబట్టి ఎవరైనా సరే శివరాత్రి రోజున మహాశివుడికి పూజ చేస్తే మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి రోజున శివుడికి పూజ చేసి పుణ్యాన్ని మూటగట్టుకొండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation