ఒక ప్రేమ పెళ్లి – రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.ఒక తాళి బొట్టు రెండు తాళిబొట్టులని తెంపేసింది.
రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు రగిల్చింది.ఒక హత్య కలకలం సృష్టిస్తే మరో ఆత్మహత్య ప్రశ్నలు మిగిల్చింది.అతి ప్రేమ ఎంత అనర్దమో కళ్లకు కట్టినట్టు చూపించింది.పిల్లలని ఎంత ప్రేమగాచూడాలొ మరోసారి గుణపాఠం నేర్పింది.అన్నీ ప్రేమలు సక్సెస్ కావు అనేది కూడా కన్నీటితో తెలియచేసింది ఈ సంఘటన.ఏదో చిన్నా చితక వార్తలు వినిపించే మిర్యాలగూడ.దేశంలోనే అతి పెద్ద వార్తకు నిలయంగా మారిపోయింది.కులదురంహకారం- కూతురిపై ప్రేమ ఇది విషాద కుటుంబం ఘటన.మొత్తంగా మారుతీరావు వేసిన స్కెచ్ కి, తన ఆత్మహత్యతో ఎండ్ కార్డ్ వేసుకున్నాడు.మరి దీని నుంచి నేర్చుకోవాల్సినవి ఏమిటి.
ఎవరు ఏం నేర్చుకోవాలి? సోసైటీ ఏం గుర్తించాలి ఇప్పుడు చూద్దాం.

తండ్రి చనిపోయిన తర్వాత అమృత సాధారణంగానే ఉంది, కాని తనే జీవితం అనుకున్న భర్త ప్రణయ్ , మరణించిన తర్వాత ఆమె ఏడాదిపైనే కోలుకోలేకపోయింది…ఆనాటి నుంచి తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ మెదడుకి మకిలి పట్టడమే ప్రణయ్ దారుణ హత్యకు దారితీసింది.

అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది…. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మారుతిరావు తన కుమార్తెను ఎంతో ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించాడు, కేవలం అతని మెదడులో నాటుకుపోయిన కులపిచ్చి, అదే అతను వేరే అగ్రకులం అయితే ఇలాంటి దారుణం జరిగి ఉండేది కాదు.

కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని అనుకోకండి.కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు. మారుతిరావు మానవ జీవితానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు.. కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది అని తెలిసి దారిలోకి తీసుకురాకపోయాడు,. స్కూల్ డేస్ లోనే వివాహం అంటే ఇప్పటి పిల్లలు ఆలోచించుకోవాలి
ఆ వయసులో ఏం ప్రేమ ఉంటుంది అనేది?
ఈ క్రింది వీడియో చూడండి
తన భర్తను కోల్పోయింది అమృత, తల్లి తాళి తెంచుకుంది అంటే కారణం అమృత అనే సమాజం నిందిస్తుంది.. కాని మారుతీ రావు ఆ దారుణం చెయ్యకపోతే అసలు కూతురు లేదు అనుకుని జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు, కాని కూతురిపై పెంచుకున్న ప్రేమ అతనిని నిద్రపోనివ్వలేదు, అందుకే అతిప్రేమ ఉంటే వారి ఇష్టాన్ని కూడా గౌరవించాలి, లేకపోతే తల్లితండ్రులు మీరు పిల్లలపై అతి ప్రేమ పెంచుకోకండి. ఆమెకు మరింత గుండె దైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలనిప్రయణ్ అమృత బిడ్డ కూడా ఈ సమాజంలో కులాల రొంపికి దూరంగా బతకాలి అని కోరుకుందాం.
ఈ క్రింది వీడియో చూడండి