ఎస్పీ బాలు జీవిత ప్రస్థానం.. ఇంజినీర్ టు సింగర్

893

ఈరోజు అత్యంత విషాదకరమైన రోజు
గానగంధర్వుడ్ని ఈ ప్రపంచం కోల్పోయింది
ఆ స్వరం ఇక మూగబోయింది
ఆ గాత్రం ప్రత్యక్షంగా భౌతికంగా మనల్ని విడిచి వెళ్లింది
అవును ఎస్పీ బాలు ఇకలేరు
అభిమానులే కాదు దేశ ప్రజలను షాక్ కి గురి చేసి బాలు మనల్ని విడిచివెళ్లిపోయారు
దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం హాస్పిటల్ తుది శ్వాస విడిచారు. మరి ఆయన రియల్ స్టోరీ తెలుసుకుందాం

ఇది కూడా చదవండి:

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 జన్మించారు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
ఆయన పేరు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ 16 భాషల్లో సుమారు 50 వేలకుపైగా పాటలు పాడారు ఆయన…. బాలు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు.. ఆయన తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్: సీఎం జగన్ మరో వరల్డ్ రికార్డు

తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. . ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు.

బాలు తండ్రి ఎస్పీ సాంబమూర్తి.. హరికథకు పెట్టింది పేరు. ఆయన సోదరి ఎస్పీ సైలజ కూడా గాయకురాలే. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. నటుడు సుభలేఖ సుధాకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు.బాలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఎస్పీబీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు. చరణ్ కూడా గాయకుడే. ఆయన సినిమాలకు నిర్మాతగానూ మారారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో మరో మారుతి రావు ఘటన.. కూతురు కళ్ళ ముందే..

బాల్యం నుంచే బాలుకు సంగీతంపై ఇష్టం ఏర్పడింది. హర్మోనియం, ఫ్లూటు లాంటి వాయిద్య పరికరాలను ఆయన సొంతంగానే వాయించేవారు. తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తను నేర్చుకునేవారు.బాలును ఇంజినీర్ చేయాలని ఆయన తండ్రి కలలుగన్నారు. అనంతపురంలోని జేఎన్టీయూలో ఇంజినీరింగ్ కోర్సులో కూడా చేర్పించారు. అయితే టైఫాయిడ్ జ్వరంతో ఆయన ఆ కోర్సును మధ్యలోనే ఆపేశారు. తర్వాత చెన్నైలోని అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్లో చేరారు.

అయితే సంగీతాన్ని మాత్రం బాలు వదిలిపెట్టలేదు. కాలేజీ వార్షికోత్సవాల్లో ఆయన పాటలు పడేవారు. కొంతమంది స్నేహితులు మద్రాస్కు వెళ్లి సినిమాల్లో పాడాలని ఆయనకు సూచించారు.
1964లో మద్రాస్ తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పోటీలో బాలు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఇది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారింది.

ఇది కూడా చదవండి: త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్

దీని తర్వాత సంగీత దర్శకుడు ఎస్పీ కొదండపాణి ఆయనకు అవకాశం ఇచ్చారు. తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల నుంచి ఆయనకు ఆఫర్లు వరుసపెట్టి వచ్చాయి.
సినిమాలో పాటలు పాడే ముందు బాలు.. మ్యూజిక్ బ్యాండ్కు లీడర్గా ఉండేవారు. ఈ బ్యాండ్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు ఆయన సోదరులు భాస్కర్, గంగై అమరణ్ కూడా ఉన్నారు. ఈ ట్రూప్లో ఇళయరాజా గిటారిస్ట్లా పనిచేసేవారు.

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా బాలు పరియం అయ్యారు. ఈ సినిమా 1966 డిసెంబరు 15న విడుదల అయ్యింది. అప్పటినుంచి 16 భాషల్లో,50000కుపైగా పాటలు పాడారు.
ఆయన మెథోడికల్ విధానంలో పాటలు పాడతారు. అంటే మొదట పాటను పూర్తిగా అర్థం చేసుకొని హావభావాలను పలికిస్తూ పాడుతుంటారు. ఇదే ఆయనకు చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చిపెట్టంది.

ఇది కూడా చదవండి: మళ్లీ లాక్ డౌన్.. అన్ని రాష్ట్రాల CMలతో మోడీ కీలక నిర్ణయం

ఒకసారి అయితే రికార్డింగ్ థియేటర్లో 12 గంటల్లోనే ఆయన 17 పాటలు పాడారు. సంస్కృతంలో బాలు వర్ణాలను చక్కగా పలుకుతారని మంచి పేరుంది.ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్ సినిమాల్లో తొలిపాట బాలూ పాడేవారు. కమల్హాసన్కు బాలూ స్వరమే చక్కగా సరిపోతుందని అందరూ అంటుంటారు.
1981 ఫిబ్రవరి 8న కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ 21 కన్నడ పాటలు పాడి బాలు రికార్డు నెలకొల్పారు…దేశ విదేశాలలో అనేక సంగీత కచేరీలు చేస్తూ సంగీత ప్రియులని ఎంతగానో పరవశింపజేశారు..అతిథి పాత్రలు పోషించారు బాలు. ప్రేమ ప్రేమికుడు పవిత్రబంధం ఆరో ప్రాణం రక్షకుడు , దీర్ఘ సుమంగళీ భవ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు.

సినీ రంగంలోనే కాక టెలివిజన్ రంగంలోను బాలు తన ఖ్యాతిని చాటారు. పాడుతా తీయగా అనే టీవీ షోని కొన్ని దశాబ్ధాల పాటు సక్సెస్ ఫుల్గా నడుపుతూ వచ్చిన ఆయన ఈ షో ద్వారా ఎంతో మంది నూతన గాయనీ గాయకులని పరిచయం చేశారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక అనేక దేశాలలో తన బృందంతో కన్సర్ట్స్ నిర్వహించి సంగీత ప్రియులని అలరింపజేశారు. పాడాలని వుంది, ఎన్నోడు పొట్టు పాడుంగళ్( జయ టీవీ), ఎదెతుంబి హాడువెను ( కన్నడ ఈ టీవీ), వానందబాది( కలైన్జర్ టీవీ), ఎందరో మహానుభావులు( జెమినీ)వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: వైఎస్ భారతి ఇంట్లో విషాదం.. హుటా హుటిన హైదరాబాద్‌కు జగన్

భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించిన బాలు ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది.

ఆయన పాడిన పాటల్లో మీకు నచ్చిన పాటని కామెంట్ చేయండి..

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation