కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్షకట్టి, తన పరువు పోతుందని మధనపడి అల్లుడు ప్రణయ్ ను అత్యంత పాశవికంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. భర్త మరణించిన తర్వాత తన కూతురు తన దగ్గరకు రాకపోతుండడం, హత్యా కేసుకు సంబంధించి ఆయనకు శిక్ష పడడం కూడా ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఉదంతం తరువాత అమృత ఉదయం తన తండ్రిని చివరిసారిగా కడసారి చూపు కోసం వెళితే, ఆమెకు ఆ అవకాశం దక్కకుండానే అక్కడి నుండి వెనక్కి పంపించివేశారు. తండ్రి చివరి చూపు కూడా దక్కకుండానే ఆమె వెనక్కి వచ్చింది.
ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా మాట్లాడుకున్నా, మారుతీరావు – అమృత ధీనగాధలో నష్టపోయింది ఆ తండ్రికూతుళ్లే. పగ, ప్రతీకారం కోరుకున్న ఆ తండ్రి కూతురుపై ఉన్న అమితమైన ఇష్టంతో చివరికి ప్రాణాలు తీసుకున్నారు. కన్న తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేకపోయింది అమృత

. లోకం దృష్టిలో మరోసారి దోషిగా నిలబడింది. అప్పుడు భర్త చావుకు, ఇప్పుడు తండ్రి చావుకు ఈ కూతురే కారణం అంటూ గుచ్చి గుచ్చి చంపెందుకు సోషల్ మీడియాలో పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. అమృతకు బతికి ఉండగానే నీచమైన పోస్ట్ లతో పాడెకట్టేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పెద్ద విలన్ ఎవరైనా ఉన్నారంటే అది అమృత అనే చెప్పుకోవాలి. ఈ ఇష్యూలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. అమృతను ‘కరోనా’వైరస్ కంటే ప్రమాదకరంగా భావిస్తూ రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు.

తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో స్పందిస్తూ.. ‘నిన్ను చూసి సిగ్గుగా ఉంది’ అంటూ అమృతపై పోస్ట్ పెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత తన పోస్ట్ పై రియలైజ్ అవుతూ క్షమించమని కోరింది శ్రీరెడ్డి. పరిణితి లేకుండా పెట్టిన పోస్ట్ పై క్షమించమని కోరుతూ.. ‘నీ పెయిన్ ఏంటో నాకు అర్థమైంది అమృత.. నేను నీపై చేసిన కామెంట్ పై రియలైజ్ అయ్యాను.. నువ్వు చాలా పోగొట్టుకున్నావ్.. సారీ.. ఆ దేవుడు నిన్న నీ బిడ్డను దీవించాలని కోరుకుంటున్నా’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇలా వెంటవెంటనే రెండు రకాల పోస్ట్ లు పెట్టి, ఆమె ఫాలోవర్స్ కు అయోమయంలో పడేసింది. అయితే శ్రీరెడ్డి పోస్ట్ కు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.

తండ్రి చావుకు కారణమైన ఆమె మీద జాలి పడితే వాళ్లంతా అమాయకులు ఎవరు ఉండరు అని కొందరు పెడితే, ఛీ ఛీ అమృతది ఒక బతుకేనా.. తానూ చేసిన ఒక్క తప్పు వలన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. రెండు కుటుంబాలు నాశనము అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. ఎవరు ఎలా పెట్టినా కానీ ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది అమృత అనే చెప్పుకోవాలి.