టెన్త్ పరీక్షలపై హైకోర్ట్ సీరియస్ KCR సంచలన నిర్ణయం

రాష్ట్రంలో సోమవారం జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈ పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి మినహా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కంటే ఎక్కువగా పదో తరగతి పరీక్షల నిర్వహణపైనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది. పరీక్షలు జరుగుతాయా? లేదా?

అన్న దానిచుట్టే ఇవి ఉంటున్నాయి. అయితే ఈ పరీక్షలపై సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వీటిపై 5.34 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండడం, ఇంకోవైపు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కరోవై వ్యాప్తి, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, మానసిక పరిస్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేసేందుకే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మరింత జాప్యం చేసి పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ప్రకటించడం, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టడం అంత తేలికైన విషయం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయడానికే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుని పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతను నిర్ణయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ పరీక్షలను పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

Content above bottom navigation