ఆ స్టార్ హీరోయిన్ తో పాటు కుటుంబ సభ్యులందరికీ వైరస్ షాక్ లో సినీ ఇండస్ట్రీ

మొన్నటి వరకు హాలీవుడ్ స్టార్స్ వరకే పరిమితం అయిన వైరస్ ప్రభావం మెల్లగా బాలీవుడ్ కు కూడా సోకుతోంది. ఇండియాలో వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న ఈ సమయంలో బాలీవుడ్ స్టార్స్ కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు మృతికి కారణం వైరస్ పాజిటివ్ రిపోర్ట్ రావడమే అంటున్నారు. తాజాగా హీరోయిన్ మోహెనా కుమారి వైరస్ బారిన పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు అంతా కూడా వైరస్ తో బాధపడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

మీడియాలో వస్తున్న వార్తలపై హీరోయిన్ మోహెనా కుమారి స్పందించింది. ఔను నాకు నా కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. అయితే మేము అంతా కూడా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాము. వైరస్ లక్షణాలు మాకు తక్కువగా ఉండటం వల్ల త్వరలోనే కోలుకుంటామని వైధ్యులు చెప్పారు అంటూ ట్వీట్ చేసింది. తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ పేర్కొంది.

మోహెనా కుమారి అత్త గారు మొదట వైరస్ కారణంగా హాస్పిటల్ లో చేరారు. అనుమానంతో కుటుంబ సభ్యులకు కూడా టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మోహెనా కుటుంబ సభ్యులు అంతా కూడా రిషికేస్లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మోహెనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆమె సన్నిహితులు సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Content above bottom navigation