ఇదెక్కడి ఆచారం.. అమ్మవారి జాతరలో ముద్దులు పెడుతూ డ్యాన్సులు..!

హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు, అనేక ఆచారాలతో జరుగుతూ ఉంటాయి. ఇక జాతర వచ్చిందంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు.. తమ ఇష్ట దైవానికి పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు, సేవలు, రథం ఇలా.. ఒక్కటేంటి? ఆ జాతర జరిగినన్ని రోజులు, రోజుకోక విధమైన సేవలతో ఆ దేవతలను, అమ్మవారిని కొలుస్తారు. కానీ ఒకచోట మాత్రం జాతర వచ్చిందంటే చాలు, ఒకరినొకరు తెగ ముద్దులు పెట్టుకుంటారు. అలా ముద్దులు పెట్టుకుంటూనే డ్యాన్సులు చేస్తారు. నిజానికి ఇలాంటి గుళ్లల్లో అపవిత్రంగా భావిస్తారు. కానీ అక్కడ మాత్రం అదే ఆచారమట.

ఈ క్రింది వీడియో చూడండి

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు ఆనుకుని ఉన్న దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఆ జాతరలో భార్యాభర్తలు కలిసి పాల్గొంటారు. ఇదో పెద్ద విశేషమా అనుకోవచ్చు..కానీ భార్యాభర్తలు జాతరలో పబ్లిక్ లో డాన్స్‌ లు వేయాలి. అంతేకాదు అలా డాన్స్ లు వేస్తు ముద్దులు పెట్టుకోవాలి. ఆ జాతరలో దంపతులు ముద్దులు పెట్టుకోవటం ఆచారంగా వస్తోంది. దీనికి వయస్సుతో తారతమ్యం ఉండదు. యువకులు, మధ్యవయస్సు వారితో పాటు వృద్ధులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకుంటారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామస్థులు ఆచార, సాంప్రదాయాలతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భార్యాభర్తలు డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకున్నారు.

Image result for అమ్మవారి జాతరలో ముద్దులు

10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరలో పురుషలు భార్యలను పబ్లిక్‌ లో ముద్దు పెట్టుకోవటానికి ఎంతో హుషారుగా పాల్గొంటారు. భార్యలు మాత్ర భర్తలతో కలిసి డ్యాన్సులు చాలా ఉత్సాహంగా వేస్తారు. కానీ మధ్యలో భర్తలు ముద్దులు పెట్టుకునేటప్పుడు మాత్రం సిగ్గుపడిపోతారు. దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గ్రామదేవత ఊరమ్మ దేవి జాతరలో భార్యాభర్తలు డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు జంటలుగా డ్యాన్స్‌ చేయడం, ముద్దులు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తేనే అమ్మవారు సంతృప్తి చెందుతారని, తామంతా అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులవుతామని స్థానికుల విపరీతంగా నమ్ముతారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ…. జాతరలో ప్రారంభంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తామనీ..తరువత విశేష పూజలు చేస్తామని, అనంతరం అనాదిగా వస్తున్న ఈ నృత్యాన్ని చేస్తామని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation