సముద్రంలో కొట్టుకొస్తున్న వింత వస్తువులు…

ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది..రోజుకో ప్రాంతానికి గుర్తు తెలియని వస్తువులు సముద్రం నుంచి కొట్టుకొని వస్తున్నాయి..అనుమానిత వస్తువులను చూసి మత్స్యకారులు గ్రామాల్లోని ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు..గత మూడు నెలలుగా ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతాలలో పరిస్థితి ఇలానే ఉంది..సముద్రం నుంచి ఎప్పుడు ఏ వసతువు కొట్టుకొస్తుందో తెలియక జనం బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు..ప్రకాశం జిల్లాలో మొత్తం 104 కిమీ సముద్ర తీర ప్రాంతం ఉంది..నిత్యం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి గుర్తు తెలియని వస్తువులు కొట్టుకొస్తున్నాయి..వీటిని చూసిన మత్స్యకారులు ఆందోలనకు గురవుతున్నారు.. జిల్లాలోని తీరప్రంతంలో వేలాది మంది మత్స్యకారులు జీవిస్తూ ఉన్నారు.. ప్రశాంతంగా ఉండే మత్స్యకార పల్లెలలో గత మూడు నెలల నుండి కలవరం మొదలయింది..కొట్టుకొస్తున్న వస్తువులను చూసి మత్స్యకారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు..మూడు నెలల క్రితం ఉలవలపాడు మండలం పెద్దపట్టపు పాలెం గ్రామానికి సముద్రం లోంచి ఒక ఖాళీ కంటైనర్ కొట్టుకొచ్చింది.. ఈ కంటైనర్ చూసి స్థానికులు ఆందోలనకు గురయ్యారు..

Image result for ఒక ఖాళీ కంటైనర్ కొట్టుకొచ్చింది

సముద్రం లో కంటైనర్ కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది..ఆ తరువాత కొత్తపల్లె పాలెం తీరానికి గుర్తు తెలియని మరో వస్తువు కొట్టుకొచ్చింది..సింగరాయకొండ మండలం పాకల మత్స్యకారుల వలకు బాంబును పోలిన గుండ్రటి వస్తువు చిక్కుకుంది..బాంబు గా భావించిన మత్స్య కారులు పోలీసులకు సమాచారం అందించారు..బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు గుండ్రటి వస్తువును భూమిలో పెట్టి పేల్చేసారు..అయినా ఆ వస్తువు ఏంటని తెలుసుకోలేకపోయారు..ఇక తాజాగా నాటు పడవలో వెదురు బొంగులతో చేసిన మందిరం చీరాల మండలం విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది..మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో చేసిన ఒక విగ్రహం ఉంది..తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన మందిరాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విజయలక్ష్మీ పురం తరలి వచ్చారు..

ఈ క్రింది వీడియో చూడండి

మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు..రెవెన్యూ అధికారులతో పాటు మెరైన్ పోలీసులు మందిరం ఎక్కడనుంచి కొట్టుకొచ్చిందో ఆరా తీసే పనిలో పడ్డారు..మందిరంలో కొన్ని ప్రాంతాలతో పాటు శ్రీలంక లో తయారయిన అగ్గిపెట్టెను అధికారులు స్వాదీనం చేసుకున్నారు…10 అడుగుల ఎత్తున్న మందిరం శ్రీలంకకు చెందినదిగా భావిస్తున్నారు..ఏదో ఒక ప్రాంతంలో గుర్తు తెలియని వస్తువులు సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకు రావడం జిల్లాలో కలకలం రేపుతోంది…గత మూడు నెలలు గా సముద్ర తీర ప్రాంతాలలో అలజడి రేగుతోంది..ఏదో ఒక గుర్తు తెలియని వస్తువులు ఇలా కొట్టుకోస్తున్నాయి..అయితే వాటి వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ వీడియో పై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో చెప్పండి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation