స్వీడన్ దేశం కోటీశ్వరాలు చెన్నైలో భిక్షమెత్తుకుంటోంది..

120

మీరు తెలుగులో వచ్చిన బిచ్చగాడు సినిమా చూసే ఉంటారు. అందులో కొన్ని పరిస్థితుల వలన కోటీశ్వరుడు అయినా హీరో రోడ్ల మీద బిచ్చం ఎత్తుకుంటాడు. అది చూసి ఇలా ఎవరు కూడా బిచ్చం ఎత్తుకోరు అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక కోటీశ్వరురాలు బిచ్చం ఎత్తుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్ వీధుల్లో ఒక విదేశీ మహిళ చేతులు జోడించి.. భిక్షాటన చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మానసిక ప్రశాంతత కోసం కోయంబత్తూర్ కు వచ్చిన ఈ స్వీడన్ కు చెందిన మహిళ వీధుల్లో అడుక్కోవటం వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రింది వీడియో చుడండి

స్వీడన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళ ఒక పెద్ద పారిశ్రామికవేత్త. కోట్ల ఆస్థి ఉంది. అయితే ఈమెకు లేనిది మాత్రం మానసిక ప్రశాంతత. ఎప్పుడు డబ్బు, వ్యాపారాలు చూసి లైఫ్ మీద విరక్తి పుట్టింది. నేను పుట్టింది సంపాదించడానికేనా, నాకంటూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ప్రశాంతంగా ఉండలేనా అని తనలో తాను కుమిలిపోయింది. అందుకే కొన్ని నెలల క్రితం తన వ్యాపారాలకు, ఆస్తిపాస్తులకు దూరంగా ఉండాలనుకుంది. దానికోసం బాగా అలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ధ్యానం చేసి తానూ ఏం చెయ్యాలో, ఎలా బతకాలో నిర్ణయించుకుంది. ఇక తన వెంట తెచ్చుకున్న డబ్బును అక్కడ బడుగు.. బలహీన వర్గాలకు చెందిన వారికి సాయం చేశారు. చేతిలో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశారు.

Swedish Rich Lady Begging In Tamilnadu

అయినా కూడా తాను కోరుకున్న మానసిక ప్రశాంతత లభించలేదు. దాంతో ఆమె ఆ లగ్జరీ లైఫ్ కు టాటా చెప్పాలనుకుంది. మళ్ళి స్వీడన్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. ఆమె కోయంబత్తూర్ వీధుల్లో బిక్షం ఎత్తుకోవడం స్టార్ట్ చేసింది. అలా చాల రోజుల నుంచి కోయంబత్తూర్ వీధుల్లో బిక్షం ఎత్తుకుని జీవిస్తుంది. అయితే ఆమె ఎందుకు భిక్షాటన చేస్తుందో కారణం మాత్రం ఎవరికీ అర్థం అవ్వడం లేదు. వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారికి రెండు చేతులతో నమస్కరిస్తున్న ఆమెకు ఐదు.. పది రూపాయిలు ఇస్తున్నారు అక్కడివారు. ఆమె తల్చుకుంటే కోట్ల రూపాయలలో సకల వైభోగాలు అనుభవించవచ్చు కానీ సంపన్నమైన ఆ మహిళ ఇలా ఎందుకు భిక్షాటన చేస్తున్నారో అర్థం కావటం లేదని అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చెబుతున్నారు. ఒక సంపన్న విదేశీ మహిళ ఇలా వీధుల్లో భిక్షాటన చేయటం స్థానికంగా సంచలనంగా మారింది.

Content above bottom navigation