మీది డీజిల్ వాహనమా..హైద‌రాబాద్ లో న‌డుపుతున్నారా అయితే మీకో బ్యాడ్ న్యూస్

109

మీరు ఉపయోగించే వాహనం డీజిలా? మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా…డీజిల్ వెహికిల్స్ మీద కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వాతావరణాన్ని కలుషితం చేయటం లో డీజిల్ వాహనాలు ముందుంటాయి. ఈ నేపథ్యం లో ఈ వాహనాల మీద ఆంక్షలు విధించేందుకు వీలుగా ఉన్న అంశాల్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురుకావడానికి ముందే మేల్కొనాలని భావిస్తున్న ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణశాఖకు సూచించినట్టు తెలుస్తోంది.

Image result for diesel vehicle pollution

డీజిల్ వాహనాల్ని నియంత్రించటం తో పాటు.. వాటి పై పన్నుల వడ్డింపు విషయం మీదా ఫోకస్ చేయాలని రవాణా శాఖ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా నగరంలో డీజిల్ వాహనాలను నియంత్రించాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది.నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీంతో డీజిల్ ఆధారిత వాహనాల సంఖ్య మరింత పెరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలపై ప్రస్తుతం రెండు శాతం పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రజలను అటువైపు ఆకర్షించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో రవాణా శాఖ అధికారులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

కలెక్టర్ల సదస్సు లో వాహనాల గురించి ప్రస్తావించార‌ట‌ ముఖ్యమంత్రి.. వాహనాల పొగతో నగరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేయటానికి ముందే.. మొక్కలు పెంచటంతో పాటు డీజిల్ వాహనాల్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని చెప్పారు. మొత్తంగా చూస్తే.. డీజిల్ వాహన దారులకు రానున్న రోజుల్లో తిప్పలు తప్పవనే చెప్పాలి. సో చూశారుగా పాత డిజీల్ వాహ‌నాలు కొనే స‌మ‌యంలో కాస్త ఆలోచించండి 12 ఏళ్లు దాటితే ఆ హ‌హ‌నాలు కొనుగోలు చేసినా వాటిని హైద‌రాబాద్ లో తిర‌గ‌నివ్వ‌క‌పోవ‌చ్చు, సో బీకే ర్ ఫుల్ , ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్షించుకోవ‌ల‌సిన బాధ్య‌త మ‌న అంద‌రిపైనా ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation