ఫుల్ గా తాగి క్లాస్ రూమ్ లోకి వచ్చిన టీచర్.. అది గమనించిన స్టూడెంట్స్ ఏం చేసారో చూడండి

148

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే టీచర్లు ఎంత చక్కగా ఉండాలి. లేకపోతే పిల్లలకి కూడా వక్ర బుద్దులు వస్తాయి.
అందుకే పిల్లలకు తల్లిదండ్రి తర్వాత గురువులే దేవుళ్లుగా భావిస్తారు.మరి అలాంటి టీచర్స్ పిల్లలకు చెప్పే పాఠాలు జీవితానికి మంచి సోపానాలు కావాలి కాని చెడ్డమార్గం కాకూడదు.కాని ఓ టీచరమ్మ చేసిన పనికి మాత్రం స్టూడెంట్స్ తో పాటు టీచర్లు కూడా షాక్ అయ్యారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పింది. పీకల వరకు మద్యం సేవించి బడికి వచ్చింది. ఆ తర్వాత ఏకంగా తరగతి గదిలోకి వచ్చి పాఠాలు చెప్పింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సూరత్‌లోని స్కూల్లో ఓ 38 యేళ్ల మహిళ, టీచరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో స్కూలుకు వెళ్లిన ఆమె తప్పతాగి తూలుతూ విద్యార్థుల కంటబడింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఘటనపై విచారణకు సూరత్ మున్సిపల్ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్‌ఎంఈబీ) ఆదేశించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

మంగళవారం జరిగిన ఎస్‌ఎంఈబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సదరు ఉపాధ్యాయురాలు స్కూల్‌కు వెళ్లడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్కూలు వర్గాలు తెలిపాయి. అయితే ఆమె స్కూల్ కి రావడమే తూలుతూ వచ్చిందట, తర్వాత విద్యార్దులని బెత్తంతో నాలుగు దెబ్బలు కొట్టింది.. అసలు పాఠాలు చెప్పలేని స్దితిలో కుర్చిలో కూర్చుంది.. దీంతో వెంటనే టీచర్స్ కు సమాచారం అందించారు పిల్లలు.. వెంటనే డీఈవో ఆఫీసుకి ఈ విషయం తెలిపారు, స్కూల్లో టీచర్ మందు తాగి వచ్చి పాఠాలు చెబుతున్నారు అని గ్రామంలో అందరికి తెలియడంతో ఆమెని డిస్మిస్ చేయాలి అని గ్రామస్తులు కోరారు, అప్పటి నుంచి ఆమె స్కూల్ కి రావడం మానేసిందట, చూశారుగా పిల్లలకు మంచి బుద్దులు నేర్పాల్సిన టీచర్లు కొందరు ఎలాంటి పనులు చేస్తున్నారో. ఆమెపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటాము అని గ్రామస్తులకి తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation