పాల సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

121

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి వీలయ్యే అన్ని పనులు వన్ బై వన్ చేసుకుంటూ పోతోంది. దురదృష్టమేంటంటే… ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా… కరోనా వైరస్ తెలంగాణలో పెరుగుతూనే ఉంది. తాజాగా కేసుల సంఖ్య 67కి చేరడంతో… మరింత అప్రమత్తమైన ప్రభుత్వం ఓ మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌ వంటి డోర్‌ డెలివరీ కంపెనీల ద్వారా పాలు సరఫరా చేసేలా చెయ్యాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ భవనంలో శనివారం వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. HMDAలో లాక్‌డౌన్‌కు ముందు రోజూ 30 లక్షల లీటర్ల పాలు సప్లై అయ్యేవనీ… ఇప్పుడు 27 లక్షలకు తగ్గాయనీ… పాలను సప్లై చేసే సిబ్బంది రావట్లేదని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. అలాంటప్పుడు స్విగ్గీ, బిగ్ బాస్కెట్ సేవలు వాడుకోమని మంత్రి ఆదేశించారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

రేటు పెంచితే కఠిన చర్యలే : ఛాన్స్ దొరికింది కదా అని పాల రిటైల్ వ్యాపారులు… MRP కంటే ఎక్కువ రేటుకు పాలను అమ్మితే… PD యాక్ట్ (బెయిల్ ఉండదు) కింద చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఎవరికైనా పాలు సప్లై అవ్వకపోతే… కంట్రోల్‌ రూం నెంబరు 040-23450624కు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అంటే… త్వరలోనే ఇంటికే పాలను సప్లై చేసే వ్యవస్థ రాబోతోందని అనుకోవచ్చు. ప్రస్తుతం అధికారులు… ఆయా డోర్ డెలివరీ సంస్థలతో మాట్లాడుతున్నారు. ఈ చర్చలు ఫలవంతం అవ్వగానే… ఇక పాలు ఇళ్లకే వచ్చేస్తాయి. ఐతే… పాల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఉందని అనిపిస్తే… ఆ ప్యాకెట్లను హ్యాండ్ శానిటైజర్ రాసుకున్న చేతులతో పట్టుకుంటే… ఏ సమస్యా ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Content above bottom navigation