హైదరబాద్ లోని 159 కంటైన్మెంట్ జోన్స్ ఇవే..లిస్టు విడుదల

110

లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నగరంలో కంటైన్మెంట జోన్లు కూడా పెరుగుతున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో.. కొత్త ప్రాంతాల్లోనూ కరోనా కేసులను గుర్తిస్తుండటంతో.. కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3 నాటికి నగరంలో 158 ప్రాంతాల్లోని ఇళ్లను కంటైన్మెంట్లో ఉంచారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఎల్బీనగర్ జోన్లో మొత్తం 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇందులో ఉప్పల్ సర్కిల్లో 16, సరూర్‌నగర్‌లో 4, హయత్‌నగర్‌లో ఒకటి చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.చార్మినార్ జోన్లో 28 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మలక్‌పేటలో 1, సంతోష్ నగర్లో 16, చాంద్రాయణ గుట్టలో 2, చార్మినార్‌లో 5, ఫలక్‌నుమాలో 4 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

ఖైరతాబాద్ జోన్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 35కి చేరింది. మెహదీపట్నంలో 5, కర్వాన్ అండ్ జియాగుడ డివిజన్లలో 17, ఖైరతాబాద్‌లో 5, జూబ్లీహిల్స్‌లో 8 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

సికింద్రాబాద్ జోన్లో 33 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో 6, ముషీరాబాద్‌లో ఏడు, అంబర్‌పేటలో 13 మల్కాజ్‌గిరిలో 7 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కూకట్పల్లి జోన్ పరిధిలోకి వచ్చే మూసాపేట డివిజన్లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

రాజేంద్ర నగర్ నగర్ జోన్‌లోని రాజేంద్రనగర్, మణికొండ ప్రాంతాల్లో ఏడు కంటైన్మెంట్ జోన్లు ఉండగా… శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ డివిజన్లో 4, శేరిలింగంపల్లిలో 5 చొప్పున మొత్తం 9 కంటైన్మెంట్ జోన్లున్నాయి.

కుత్బుల్లాపూర్‌లో 7, మహేశ్వరం జోన్‌లోని జలపల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌పేటలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 159గా ఉంది. ఈ ప్రాంతాలు మొత్తం కంటైన్మెంట్లో లేవని.. వీటిలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని తెలిపారు.

Content above bottom navigation