తెలంగాణా లో బయటపడ్డ 55 రకాల కరోనా వైరస్ లు..షాక్ లో కెసిఆర్

105

తెలంగాణలో కరోనా వైరస్.. ఇది ఒక్క రకం.. రెండు రకాలు కావు. ఏకంగా 55 రకాల కరోనా వైరస్లు ఉన్నాయట. అంటే కరోనా వైరస్ 55 రకాలుగా జన్యు మార్పులు చేసుకుంటున్నదన్న మాట. ఈ విషయాన్ని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక, దేశంలో 198 రకాల కరోనా వైర్సలను గుర్తించినట్లు తెలిపింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

కొవిడ్-19కు చెందిన 400 జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన భారత్లోకి ప్రవేశించాక లేదా అంతకంటే ముందే వైరస్లో 198 రకాల జన్యు మార్పులు జరిగాయని వెల్లడించింది.

అత్యధిక జన్యు మార్పులకు గురైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, ఇక్కడ 55 రకాల వైరస్లను గుర్తించినట్లు వివరించింది. అటు.. గుజరాత్లోని ఒక్క అహ్మదాబాద్లోనే 60 రకాల కరోనా వైరస్లు ఉన్నాయట. ఢిల్లీలో 39 రకాలు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల కరోనాలు ఉన్నట్లు తెలిపింది.

అయితే, దేశంలో గుర్తించిన 198 రకాల కరోనా వైరస్లలో చైనా, యూరప్ నుంచి వ్యాపించిన రెండు రకాల కరోనా వైరస్ల వల్లే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇరాన్, దుబాయ్ దేశాల్లో వ్యాపిస్తున్న రకం కరోనాల ప్రభావం భారత్లో చాలా తక్కువగా ఉందని చెప్పారు.

Content above bottom navigation