తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు కొత్త మార్గదర్శకాలు ఇవే

89

తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 40 అంశాలను పొందుపరుస్తూ కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి పలు జాగ్రత్తలు, సూచనలు చేసింది. ఈ నెల 8 నుంచి కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చింది. ప్రార్థనా మందిరాలు, ఆతిథ్య సేవలు, అంతర్రాష్ట్ర రాకపోకలకు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ కు అనుమతి ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను జూలైలో ప్రారంభించుకోవచ్చని సీఎస్ సోమేశ్ కుమార్ జీవో నంబరు 75ను జారీ చేశారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనాలయాల వద్ద భక్తులు కచ్చితంగా ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పవిత్ర గ్రంథాలను, దేవుళ్ల విగ్రహాలను తాకవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎక్కడికి వెళ్లినా మాస్కులు తప్పనిసరి. రాత్రి 8.30 కల్లా ప్రార్థనా మందిరాలను తప్పనిసరిగా మూసేయాల్సి ఉంటుంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న స్థలాల్లో శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లి బయటకు వచ్చేందుకు మార్గాలు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

లిఫ్టుల్లో ఎక్కువ మంది వెళ్లే వీలు లేదని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. హోటల్ కు వచ్చే అతిథుల వివరాలతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలని ప్రభుత్వం నిర్వాహకులను ఆదేశించింది. రెస్టారెంట్లలో టేబుళ్ల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏసీ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని సూచించింది. మాల్స్లో చిన్నారులు ఆడుకునే స్థలాలను తెరవరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా హాళ్లు, జిమ్లు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, క్లబ్బులు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం యధావిధిగా కొనసాగనుంది. పరిస్థితిని బట్టి వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Content above bottom navigation