పాకిస్తాన్ యొక్క 7 షాకింగ్ చట్టాలు..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఉంటుంది. తమ పరిస్థితులకు తగ్గట్టు ఆయా దేశాలు తన చట్టాలను రూపొందించుకున్నారు. అయితే కొన్ని దేశాల చట్టాలు, అక్కడ ప్రజలు పాటిస్తున్న రూల్స్ గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి కొన్ని ఆశ్చర్యకర రూల్స్ ను చట్టాలను పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వం పాటిస్తుంది. ఈ వీడియోలో పాక్ లో ఉన్న కొన్ని షాకింగ్ చట్టాల గురించి తెలుసుకుందాం.

 • పాకిస్తాన్ లో ఒక అమ్మాయిని అబ్బాయి పరిచయం చేసుకుని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోకూడదు. గర్ల్ ఫ్రెండ్ గా చేసుకునే దానిని పాక్ ఎందుకు బ్యాన్ చేసిందంటే.. పాక్ కల్చర్ చాలా నీట్ గా ఉంటుందంట. ఆ కల్చర్ ను ఈ కల్చర్ మార్చేస్తుందని గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ను బ్యాన్ చేశారు. అలాగే పెళ్లి కాకుండా వేరే అమ్మాయితో సహజీవనం చెయ్యడానికి కూడా వీలుండదు.
 • బాలీవుడ్ సినిమాల ప్రభావం పాక్ ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఈ బాలీవుడ్ సినిమాల ఆధారంగానే వీళ్ళు చేసే పనులలో, వీళ్ళ ఆలోచనలో మార్పు వస్తుందంట. అంతటి ఇంప్యాక్ట్ ఈ సినిమా వలన వీళ్లకు కలుగుతుంది.
Image result for పాకిస్తాన్
 • నెలలో ఒకసారి బయట తినడం అనేది ఈ దేశంలో బ్యాన్ చేశారు. రంజాన్ మాసం వీళ్లకు చాలా పవిత్రమైన మాసంగా ఉంటుంది. పాక్ ఒక ఇస్లామిక్ దేశం అని మనకు తెలుసు. ఇస్లామిక్ ఆచారం ప్రకారం రంజాన్ మాసంలో ఎవరు కూడా బయట తినకూడదంట. పాక్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ సమస్య వచ్చింది. మిగిలిన మతాల వాళ్ళు కూడా ఈ రంజాన్ మాసంలో బయట తినకూడదు.
 • పాక్ లో ఉండే ఏ ఒక్కరు కూడా ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళలేరు. ఇజ్రాయిల్ వెళ్ళడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఎందుకో తెలుసా.. పాక్ దృష్టిలో ఇజ్రాయిల్ అసలు ఒక దేశము కాదు.
Image result for pakistan girls
 • పాక్ లో ఇతరుల ఫోన్ తీసుకోవడం చట్టరీత్యానేరం. అవతలి వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ ఫోన్ ముట్టుకోవాలి. లేకుంటే ఆరునెలల శిక్ష పడుతుంది. ఫామిలీ మెంబర్స్ ముట్టుకున్నా సరే ఆ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలు జైలులో వేస్తారు.
 • పాక్ లో చదువుకోవాలంటే ఎక్కువ టాక్స్ పే చెయ్యాల్సి ఉంటుంది. చదువుకునే వారి కోసం స్కూల్ లలో కాలేజీలలో ఫీజ్ లు కట్టడం మానేసి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ మీద టాక్స్ వసూల్ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఏ స్టూడెంట్ అయితే చదువు కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతాడో అతను గవర్నమెంట్ కు 10 % పన్ను కట్టాల్సి ఉంటుంది.
 • మన దేశ ప్రధానికి గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ పాక్ లో మాత్రం అక్కడి ప్రధానిని ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ మీరు అనడం ఎవరైనా పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్లు విన్నారంటే..మీరు ఊహించనంత శిక్ష వేస్తారు.
 • పాక్ లో ప్రధాని అవ్వాలన్నా, రాష్ట్రపతి అవ్వాలన్నా చదువు అస్సలు అవసరం లేదు. కానీ అక్కడి ప్రభుత్వ ఆఫీసులలో ప్యూన్ ఉద్యోగం కావాలన్నా కూడా మినిమమ్ 10 వ తరగతి సర్టిఫికెట్ కావాలి.
 • మన వాట్సాప్ లలో అప్పుడప్పుడు కొన్ని పనికిరాని మెసేజ్ లు వస్తుంటాయి. కానీ పాక్ లో ఇలాంటి మెసేజ్ లు వస్తే వాటిని మీరు పోలీసుల వద్దకు తీసుకెళ్తే ఆ పనికిమాలిన మెసేజ్ పంపిన వ్యక్తికీ 10 లక్షల జరిమానా విధిస్తారు. పాక్ లో స్పామ్ మెసేజ్ లు పంపడం కూడా ఇల్లీగల్ గానే భావిస్తుంది అక్కడి ప్రభుత్వం.

ఈ క్రింది వీడియో ని చూడండి

 • ఈ దేశంలో కొన్ని అరబిక్ పాదాలను ఇంగ్లిష్ లోకి ట్రాన్స్ లెట్ చెయ్యడం కూడా ఇల్లీగల్. అల్లా. మర్షద్, రసూల్, నబీన్.లాంటి పాదాలను ఇంగ్లిష్ లోకి ట్రాన్స్ లెట్ చెయ్యకూడదు.
 • ఈ దేశంలో మూడు రకాల కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. పేదల కోసం ఒకటి, ఊళ్లలో ఉండేవాళ్లు కోసం ఒకటి, సిటీలలో ఉండేవాళ్లు కోసం ఒకటి. మొదటిది పాకిస్తాన్ ప్యానల్ కోడ్, రెండవది సివియా చట్టం, మూడవది జింకా చట్టం.
 • ఆదివారం రోజున, పండుగల సమయాన ఈ దేశంలో ఇద్దరు వ్యక్తులు బైకుల మీద వెళ్ళకూడదు. కేవలం ఒకరు మాత్రమే వెళ్ళాలి.
 • ఇవేనండి పాక్ లో ఉన్న కొన్ని వింత చట్టాలు, వింత రూల్స్. మరి పాక్ లో ఉన్న ఈ రూల్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

 • ఈ క్రింది వీడియో ని చూడండి
Content above bottom navigation