భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ, వైద్య నిపుణులకు అవసరమైన రక్షణ కవచ దుస్తుల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌తో పోరాడటానికి వైద్య నిపుణులు, సిబ్బంది కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఓ బయో సూట్ రెడీ చేసింది. DRDO తయారు చేసిన బయో సూట్ ఒక యూనిక్ ఫీచర్ కలిగి ఉంది.

జలాంతర్గామి అప్లికేషన్లలో ఉపయోగించే సీలెంట్ ఆధారంగా సీమ్ సీలింగ్ టేప్‌కు ప్రత్యామ్నాయంగా DRDO ప్రత్యేక సీలెంట్‌ను సిద్ధం చేసిందని తెలిపింది. జలాంతర్గామి అప్లికేషన్ల కోసం ఉపయోగించే ప్రత్యేక సీలెంట్ అవసరం.. ఎందుకంటే DRDO ప్రకారం.. సీమ్ సీలింగ్ టేపులు అందుబాటులో లేకపోవడం వల్ల భారతదేశంలో దాని పరిశ్రమ భాగస్వాములు, ఇతర పరిశ్రమలు బయో సూట్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం, ఇండస్ట్రీ పార్టనర్ సీమ్ సీలింగ్ కోసం ఈ జిగురును ఉపయోగించి తయారుచేసిన బయో సూట్లపై దక్షిణ భారత టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (SITRA) కోయంబత్తూర్‌లో టెస్టు పూర్తి చేసింది. వస్త్ర పరిశ్రమకు ఇదొక గేమ్ ఛేంజర్ కూడా. సూట్ తయారీదారుల ద్వారా సీమ్ సీలింగ్ కార్యకలాపాలకు సపోర్ట్ ఇవ్వడానికి DRDO పరిశ్రమ ఈ జిగురును భారీగా ఉత్పత్తి చేయగలదు”అని పేర్కొంది.
కుసుమ్గఢ్ ఇండస్ట్రీస్ ముడి పదార్థం (రా మెటేరియల్స్, పూత పదార్థం (కోటింగ్ మెటేరియల్) ఉత్పత్తి చేస్తోంది. పూర్తి సూట్ మరొక వెండర్ సాయంతో తయారు చేస్తోంది. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 7,000 సూట్లు. వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనుభవంతో మరో వెండర్‌ను తీసుకోస్తున్నారు. రోజుకు 15,000 సూట్లకు సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి”అని DRDO ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.బయో సూట్ ప్రభావానికి సంబంధించినంతవరకు, పరిశ్రమ సహాయంతో సూట్ తయారు చేయడం జరిగిందని డీఆర్ డీఓ తెలిపింది.