కరోనా ఎఫెక్ట్ : ప్రపంచ బ్యాంకు భారత్ కి ఎంత సహాయం అందించిందో తెలుసా…?

148

ప్రపంచ దేశాలన్నినింటిని కూడా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి భయంకరమైనకరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మనమందరం కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాం. ఇప్పటికే మనదేశంలో ఎంతో మంది ప్రముఖులు చాలా వరకు విరాళాలు అందించినప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ అంశాలు కనిపించడం లేదు. ఇకపోతే ఈ తరుణంలో ప్రపంచ బ్యాంకు, ప్రపంచంలోని దేశాలన్నింటికీ కూడా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా వైరస్‌ను అరికట్టడానికి భారత ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రపంచబ్యాంకు వెన్నుదన్నుగా నిలిచింది.

Korea Exim Bank to give Rs 4,100 crore loan for Vizag Metro- The ...
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, బ్యాంకుల లావాదేవీలు, రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా వస్తు, సేవల పన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం అందలేదు. లాక్‌డౌన్ వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. అదే సమయంలో- లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోన్న పేద కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీన్ని అమలు చేస్తోంది. లాక్‌డౌన్ వల్ల ఒకవంక లక్షల కోట్ల రూపాయల రాబడి స్తంభించడం, మరోవంక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది.’

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

కరోనా వైరస్‌ను నివారణ చర్యల కోసం ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ప్రపంచబ్యాంకునకు కొద్దిరోజుల కిందటే ప్రతిపాదనలను పంపించారు. దీన్ని ఆమోదించింది ప్రపంచబ్యాంకు. ఒక బిలియన్ డాలర్ల అత్యవసర నిధులను మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత కరెన్సీలో దాని విలువ రూ.7600 కోట్లు. ఈ మేరకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఒక్క భారత్‌కు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పున నిధులను మంజూరు చేసింది. భారత ఉపఖండంలోని పాకిస్తాన్-200, శ్రీలంక-128.6, ఆఫ్ఘనిస్తాన్-100. మాల్దీవులు-7.3 మిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సహకారాన్ని అందజేయడానికి అంగీకరించింది. కరోనా వైరస్ కారణంగా దాదాపుగా కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోవడం వలన ఈనిర్ణయం తీసుకున్నామని వరల్డ్ బ్యాంక్ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్స్‌ ప్రకటించారు. ఈ నిధులతో ఆయా దేశాలు అత్యవసర వైద్య సదుపాయాలను కల్పించడానికి, కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులను స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్‌, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు నిధులనువాడనున్నారని సమాచారం.

Content above bottom navigation