అప్పుడు దిశ .. ఇప్పుడు చెన్నమ్మ..సేమ్ టూ సేమ్

33156

దిశ ఘటన నుంచి తేరుకోక ముందే సరిగ్గా అలాంటి దుర్ఘటన మరొకటి జరిగింది. ఈ సంఘటన కూడా తెలంగాణాలో చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈసారి అత్యాచారం లాంటి ఘటన చోటుచేసుకోలేదు కానీ బంగారం కోసం దారుణంగా హత్య చేశారు. ఎక్కడైనా భార్య తప్పుచేస్తుంది. లేదంటే భర్త తప్పు చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం భార్యాభర్తలు కలిసి ఓ హత్య చేశారు. డబ్బుకు ఆశపడి నేరం చేసి పోలీసులకు చిక్కారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దానికి కారణం ఈ భార్యాభర్తలే. పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

అప్పుడు దిశ .. ఇప్పుడు చెన్నమ్మ..సేమ్ తో సేమ్

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన యావననేది చెన్నమ్మ (25) గత మూడు సంవత్సరాల క్రితం గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు వలస వచ్చింది. ప్రతిరోజూ కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. చేవెళ్లలోనే కూలీ పనులు చేసుకుంటున్న చెన్నమ్మకు అనీల, సర్దార్‌ అలియాస్‌ రాజులు స్నేహితులయ్యారు. ముగ్గురూ కలిసి రోజూ కూలీ పనులు చేసుకునేవారు. రాజు దంపతులు ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కన్ను చెన్నమ్మపై పడింది. చెన్నమ్మ దగ్గర భారీగా ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్న రాజు, అనిలా వాటిని దోచుకోవాలనుకున్నారు. 20 రోజుల క్రితం చెన్నమ్మకు మాయమాటలు చెప్పిన రాజు ఆమెను బొపునారం గ్రామ శివారుకి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు.

ఈ క్రింది వీడియోని చూడండి

పథకం ప్రకారం భార్యభర్తలకు చెన్నమ్మకు మద్యం ఎక్కువగా తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి చంపేసి పొదల్లో శవాన్ని పడేసి తగలబెట్టాడు రాజు. ఆ తర్వాత రాజు, అనీల చేవెళ్లకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. జనవరి 26న చెన్నమ్మ కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువుల వద్ద ఆరా తీయగా ఆచూకి లభించకపోవడంతో అన్న కుర్మయ్య చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తోటి కూలీలైన అనీల, రాజులను విచారించగా “మేమె చెన్నమ్మను బంగారం కోసం చంపేసాము” అని ఒప్పుకున్నారు. దాంతో బొపునారం గ్రామంలోని అడవులకు వచ్చి వెతకగా చెన్నమ్మ అస్తికలు లభించాయి. దీంతో అక్కడే పోస్టుమార్టం పంచనామా నిర్వహించి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూర్‌ సీఐ రాజశేఖర్‌, చేవెళ్ల సీఐ బాలక్రిష్ణ, చేవెళ్ల ఎస్‌ఐ రేణుక, బంట్వారం ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డిలు తెలిపారు. మృతిచెందిన చెన్నమ్మ ఒంటిపై 3 తులాల బంగారం, 70తులాల వెండి ఆభరణాలు ఉన్నందున వాటి కోసం ఈ హత్య చేసివుంటారని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation