రాబోయే 10 రోజుల్లో ఏం జరగబోతుంది?

ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా.. ఇప్పటివరకు హై రిస్క్ ఉన్నట్లుగా ప్రకటించబడిన దేశాలు.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం కత్తి మీద సాము లాంటిదే.. అయినా ఆ సాము చెయ్యక తప్పని పరిస్థితి. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో అడ్డుకట్ట వెయ్యడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు. విమానాల్లో వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించడం. తరచూ వారి నమూనాలు సేకరించి పరీక్షించడం. హైరిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారైతే వారిని గుర్తించి, ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరిశీలన చేయించడం.. ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్బంధించి క్వారంటైన్‌కు తరలించడం. ఇదంతా చాల కష్టతరమైందే.. అయితే పది రోజులు ఎందుకు లాక్ డౌన్ అంటున్నాయి ప్రభుత్వాలు. పది రోజులకు వైరస్ నాశనం అయిపోతుందా? లేకపోతే వైరస్‌కు మందును కనుక్కొంటారా? అసలు పది రోజులే ఎందుకు జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి.

ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజకీయ కోణంలో చూడడం మాములు అయిపోతుంది. అయితే ఒక మంచి పని అనుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలి. ఇందులో వక్రీకరణలు అక్కర్లేదు. పిచ్చి బాష్యాలు ప్రచారం చెయ్యకూడదు. సూటిగా విషయం చెప్పాలి. ప్రజలకు నమ్మకం కలిగించేలా చెయ్యాలి. భయానక పరిస్థితుల్లో ఉన్న ప్రజలను భయం నుంచి బయటపడెయ్యాలి. ఈ క్రమంలోనే జనతా కర్ఫ్యూ విధించడంతో ఆదివారం(22 మార్చి 2020) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దేశమంతా బయటకు రాకుండా క్రమశిక్షణగా ఉంది. అయితే అది సరిపోదు.. కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేర్చాలి. వైద్యం చేయించాలి. ఉన్నవారికి రోగం తగ్గించాలి. కొత్తగా రోగం ఎవరికీ రాకుండా చూసుకోవాలి. దీనికి కచ్చితంగా పది రోజులు అవసరం.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

ఈ క్రింది వీడియో చూడండి

ఈ వైరస్ రాగిపై 4 గంటలపాటు ఉంటుంది. కార్డ్ బోర్డుపై 24 గంటలు.. ప్లాస్టిక్, స్టీల్ ఉపరితలాలపై రెండుమూడు రోజులు బతికి ఉంటుందట. అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల వరకు బతకగలదు. అంటే వైరస్‌ సోకిన వ్యక్తులకు వారి శరీరతత్వాన్ని బట్టి 4 నుంచి 14 రోజుల దాకా ఎలాంటి లక్షణాలూ కనపడవు. అంటే ఆ సమయంలో వారు క్యారియర్లుగా ఉంటారు. వారి నుంచి వైరస్‌ మరొకరికి పాకుతుంది. అంటే దీనిని కట్టడి చెయ్యలంటే.. పది రోజులు కచ్చితంగా అవసరమే అనేది ప్రభుత్వం ఆలోచన. డాక్టర్ల అభిప్రాయం కూడా.అందుకే వైరస్ కట్టడి చెయ్యగానికి ఈ పది రోజులు కచ్చితంగా కీలకం. రాబోయే రోజుల్లో ఈ వ్యాధి తీవ్రత ఇంకా పెరిగితే చాలా కఠిన నిర్ణయాల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆ పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితే మేలు కదా? సోషల్ డిస్టెన్సింగ్, హౌజు ఐసోలేషన్, క్వారంటైన్ అవసరం ఎంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

Image result for corona virus

వ్యాధి వ్యాప్తి బాగా పెరిగితే, అదుపు తప్పితే దేశంలో బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే లాక్ డౌన్ కచ్చితంగా అవసరమే అనేది.ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే. ఒక్కటి మాత్రమే రోగి ద్వారా వ్యాపించింది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వచ్చినా వాళ్లను రాష్ట్రంలోకి రానివ్వరు. క్వారంటైన్, ఐసోలేషన్ క్యాంపులకు తరలిస్తారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య పరిశీలనలో ఉన్న వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. వారి సంఖ్య సమాచారం పూర్తిగా ప్రస్తుతానికి లేదు. అయితే ఈ పదిరోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మాములు పరిస్థితికి రావచ్చు అనేది ప్రభుత్వం చెబుతుంది. వైద్యులు చెబుతున్నది. అందుకే ఈ పదిరోజులు కరోనాపై యుద్ధానికి కీలకం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation